అదరగొట్టిన హెచ్‌యూఎల్
ముంబై: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ (హిందుస్తాన్ యూనీ లీవర్) క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. మార్కెట్ విశ్లేషకులు అంచనాలను మించి లాభాలను నమోదుచేసింది. లాక్మే సౌందర్య సాధనాల, బ్రూ కాఫీ వరకు ఉత్పత్తుల తయారీదారు హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్ క్యూల త్రైమాసిక లాభంలో 6.2 శాతం పెరుగుదలను నమోదు చేసింది. నికర లాభాలు భారీగా పుంజుకుని 1,183కోట్లు సాధించినట్టు రిపోర్ట్ చేసింది. అంతకుముందు సంవత్సరం ఇది 1,114 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం రూ.8773 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఎబిట్టా మార్జిన్లు రూ.1738కోట్లుగా నిలిచాయి. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ నాలుగు శాతంగా నిలిచినట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది.
పియర్స్, డోవ్ ఉత్పత్తుల యొక్క బలమైన విక్రయాలు సహాయపడ్డాయని పేర్కొంది. వ్యక్తిగత సంరక్షణ సెగ్మెంట్ వాసలైన్ ,పాండ్స్ లాంటి బ్రాండ్ల రెవెన్యూ 8 శాతం పెరిగి రూ .4,075 కోట్లకు చేరుకుందని ప్రకటించింది. అలాగే ఇటీవల లాంచ్ చేసిన ఫెయిర్ అండ్ లవ్లీ కూడా తమ ఆదాయాల్లో కీలక పాత్రపోషించిందని యాజమాన్యం ప్రకటించింది. అలాగే జీఎస్‌టీ ని స్వాగతిస్తున్నట్టు పేర్కొంది.