స్కూల్కి వెళ్లనని మారాం చేసిందని... | father beat daughter to death | Sakshi
Sakshi News home page

స్కూల్కి వెళ్లనని మారాం చేసిందని...

Published Fri, Oct 7 2016 9:13 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

స్కూల్కి వెళ్లనని మారాం చేసిందని...

స్కూల్కి వెళ్లనని మారాం చేసిందని...

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రామసింగవరంలో దారుణం చోటు చేసుకుంది. రంగాపురం హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్న మల్లీశ్వరి తరచు స్కూల్కు వెళ్లనని మారాం చేస్తుంది. దీంతో విసిగిపోయిన తండ్రి రాజారత్నం ఆమె తీవ్రంగా కొట్టాడు. దాంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. కంగారు పడిన ఆమె తల్లిదండ్రులు వెంటనే ఆమెను గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. ఆమె కోమాలోకి వెళ్లిందని... చెప్పడంతో ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మల్లీశ్వరి అక్కడ చికిత్స పొందుతూ మరణించింది.

ఈ విషయం గ్రామంలో తెలిస్తే ప్రమాదమని భావించిన ఆమె తల్లిదండ్రులు మరో మహిళ సహాయంతో గుట్టుచప్పుడు కాకుండా పూడ్చి పెట్టారు. అనంతరం తండ్రి రాజారత్నం పరారైయ్యాడు.  ఇరుగుపొరుగు వారు మల్లీశ్వరి గురించి ఆరా తీస్తే... బంధువుల ఇంటికి వెళ్లిందని ఆమె తల్లి చెబుతుండేది. కానీ కుమార్తె మృతి విషయం బయటకుపొక్కడంతో స్థానికులు నిలదీశారు.

ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మల్లీశ్వరి తల్లీతోపాటు ఆమెకు సహకరించిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా తండ్రి రాజారత్నం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన సెప్టెంబర్ 22వ తేదీన చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement