'ఇదొక యువకుల పైశాచికత్వం'
అహ్మదాబాద్: అది గాంధీమహాత్ముడు నడిచిన నేల. అహింస అనే ఆయుధం పుట్టిన పుణ్యభూమి.. కానీ, ఆ అహింస హింసపాలై మట్టిలో కలిసిపోయిందేమో అని అనుకోక మానదు ఈ ఘటన చూస్తే. ఒకరు కాదు ఇద్దరు ఏకంగా ఎనిమిదిమంది యువకులు అంతా ఉడుకునెత్తురుతో ఉన్నవారే. కానీ అందులో సంస్కారలేమి అనే రక్తం పారుతోందనుకుంట. ఓ పాన్ డబ్బాదగ్గరకు వెళ్లి అక్కడ తమకు కావల్సిన వస్తువులు తీసుకొని డబ్బులు అడిగినందుకు పాన్ డబ్బా యజమాని పట్ల క్రూరంగా ప్రవర్తించారు.
రోడ్డుపైకి ఈడ్చి చావు దెబ్బలు కొట్టారు. అదికూడా ఏమాత్రం దయలేకుండా పాన్ షాపులో ఉన్న అతడిని బయటకులాగి కర్రలతో ఇష్టమొచ్చినట్లుగా కొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంత జరుగుతున్న తమకు ఏమీ పట్టనట్లుగా చుట్టూ నిల్చుని కొందరు వ్యక్తులు చూస్తుండటం మానవత్వం ధైర్యాన్ని కోల్పోయిందో.. స్వార్థాన్ని పులుముకుందో అనిపిస్తుంది. సెప్టెంబర్ 1న జరిగిన ఈ కళ్లు చెదిరే ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.