malleswari
-
ఈ సీన్ ఏ సిన్మాదో... చెప్పుకోండి చూద్దాం!
తెలుగులో క్లాసిక్ అనదగ్గ సినిమాల్లో ఎప్పటికీ చోటు దక్కించుకునే ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఆ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... ఊర్లో వందకు పైగానే మగ్గాలున్న నారప్పకు ఒక్కగానొక్క కూతురు మల్లీశ్వరి. నారప్ప ఆ ఊరికే పెద్ద. డబ్బున్న కుటుంబమే. మల్లీశ్వరి నిజానికి అందరిలాంటి అమ్మాయే అయితే ఆమె కథ ఈ మలుపు తీసుకోదు. మల్లీశ్వరి అందరిలో ఒకరు అనిపించుకునే సాధారణ అమ్మాయి కాదు. చురుకైనది. తెలివైనది. అద్భుతంగా నాట్యం చేస్తుంది. అంతే అద్భుతంగా పాడుతుంది కూడా! అయితే పాడమని అడిగితే సిగ్గు పడుతుంది. నాట్యం చేయమని అడిగితే ఏకంగా పారిపోతుంది. బావ నాగరాజు అడిగితే మాత్రం ఆమె సిగ్గుపడదు. అతనడిగితే ఏదైనా చేసేస్తుంది. మల్లీశ్వరికి బావంటే అంతిష్టం. ఒకరోజు మల్లీశ్వరి, నాగరాజు పక్క ఊర్లో సంతకు వెళ్లి తిరిగివస్తోంటే పెద్ద వర్షం కురుస్తోంది. ఒక చిన్న కొండలాంటి ప్రాంతంలో ఉన్న సత్రంలో వర్షంలో తడవకుండా దాక్కున్నారు. మల్లీశ్వరి సరదాగా ఆడి పాడుతోంది. అప్పుడే అటుగా వచ్చిన విజయనగర సామ్రాజ్య పాలకులు శ్రీకృష్ణదేవరాయల వారు, ఆయన ఆస్థానంలో పనిచేసే పెద్దలు మల్లీశ్వరి నాట్యాన్ని చూశారు. మహారాణివారి ఇష్టసఖి మర్యాదలను అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న యువతిగా మల్లీశ్వరిని రాయలవారి ఆస్థాన కవి కీర్తించారు. రాయలవారు ఆమెకు ఒక పెద్ద హారం బహుమానంగా ఇచ్చారు. వర్షం ఇంకా అలాగే కురుస్తోంది. ఆ సత్రంలో చేరిన వారంతా మల్లీశ్వరితో, నాగరాజుతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తున్నారు. ఆ కబుర్ల మధ్యలో అకస్మాత్తుగా అడిగాడు నాగరాజు – ‘‘మల్లి ఆట – పాటను మెచ్చుకున్నారు. మీరొక ఉపకారం చేస్తారా?’’.‘‘ఓ! చెప్పు నాయనా! విజయనగరంలో మీకేది కావాలన్నా మేం మీకు ఏర్పాట్లు చేయగలం.’’ భరోసానిస్తూ చెప్పాడు రాయలవారి ఆస్థాన కవి. ‘‘మరేం లేదులెండి! ఇందాక అదేదో సెలవిచ్చారు కదా. మహారాణివారి ఇష్టసఖి మర్యాదలని. అవేవో కాస్త జరిగేటట్టు చూడండి. మన రాయల వారితో ఇక్కడ మల్లీశ్వరి అని ఒక పిల్ల ఉందని మనవి చేయించి, పల్లకి పంపించేటట్టు మాత్రం చూడండే!’’ నవ్వుతూ అడిగాడు నాగరాజు. బావ ఆటపట్టిస్తూ అలా మాట్లాడుతున్నాడని తెలిసి, మల్లీశ్వరి వెక్కిరిస్తూ, బావను ఉద్దేశించి, అతని మాటల్ని తిప్పి చెప్పుతూ, ‘‘పల్లకి పంపేటట్టు మాత్రం చూడండే!’’, ‘‘.. పంపండి స్వామి! పల్లకి తప్పకుండా పంపండి. మా కోతిబావ పల్లకీ ఎక్కి, పళ్లు ఇకిలిస్తూ ఊరేగుతాడు.’’ అని గట్టిగా నవ్వింది. మల్లీశ్వరి మాటలకు అక్కడున్న వారంతా సరదాగా నవ్వుకున్నారు. అయితే అప్పటికి మల్లీశ్వరికి గానీ, నాగరాజుకు గానీ, వచ్చిన వాళ్లలో శ్రీకృష్ణదేవరాయలవారే ఉన్నారని తెలియదు. ∙∙ మహారాణివారి ఇష్టసఖి అవ్వడమన్న ఆలోచనను అప్పటికే మరచిపోయింది మల్లీశ్వరి. రోజులు గడుస్తున్నాయి. మల్లీశ్వరికి పెళ్లి చేయాలన్న ఆలోచన చేసింది తల్లి. ‘‘ఎవరినో వెతకడం ఏమిటి? మన నాగరాజే ఉన్నాడు కదా!’’ అన్నాడు తండ్రి నారప్ప. మల్లీశ్వరిని ఏ పనీ లేని నాగరాజుకు ఇచ్చి చేయడం తనకు ఇష్టం లేదని చెప్పింది తల్లి. పెద్ద గొడవ కూడా చేసింది. రెండు కుటుంబాలను నిశ్శబ్దం ఆవరించింది. నాగరాజు మల్లీశ్వరిని నొప్పించలేక, ఆమెకు దూరంగా వెళ్లి, డబ్బు సంపాదించాకే తిరిగొస్తానని తల్లికి ఇచ్చిన మాటను కాదనలేక ఊరొదిలి దూరంగా ఒక పట్నంలో పని చేసుకుంటున్నాడు.శిల్పాలు చెక్కడం నేర్చుకొని మంచి శిల్పిగా పేరు తెచ్చుకుంటున్నాడు. మల్లీశ్వరి నాగరాజు తిరిగొచ్చే రోజు కోసం ఎదురుచూస్తూనే ఉంది. అలాంటి ఒకరోజున శ్రీకృష్ణదేవరాయల వారినుంచే ఒక ఉత్తర్వు అందింది, మల్లీశ్వరిని మహారాణివారికి ఇష్టసఖిగా నియమించినట్టు. మల్లీశ్వరి ఆ ఉత్తర్వు విని అక్కడే కూలబడిపోయింది. ఒక్కసారే ఎదురైన అదృష్టాన్ని చూసి కళ్లు తిరిగిందని సర్ది చెప్పుకున్నారంతా. వైభవంగా ఏర్పాట్లు జరిగాయి.మల్లీశ్వరిని రాణివాసానికి తీసుకెళ్లడానికి పెద్ద పల్లకిని కూడా సిద్ధం చేశారు. కొండలు, గుట్టలు దాటి పల్లకి విజయనగరం చేరింది. మల్లీశ్వరి రాణివారికి ఇష్టసఖిగా చేరిపోయింది. మరోపక్క నాగరాజు ఊరికి తిరిగొచ్చాడు. మల్లీశ్వరి లేదని తెలుసుకొని కుమిలిపోయాడు.రోజులకు రోజులు ఏమీ తినకుండా ఒక్కటే ఒక్క శిల్పాన్ని చెక్కుతున్నాడు. మల్లీశ్వరి రూపమది. రాయలవారి ఆస్థానంలోని ఓ వ్యక్తి నాగరాజు చెక్కిన శిల్పాన్ని చూశాడు. రాయలవారి రాచనగరంలో నిర్మిస్తున్న నర్తనశాలకు పనిచేయాల్సిందిగా నాగరాజును ఆ వ్యక్తి కోరాడు. నాగరాజు ముందు ఒప్పుకోకపోతే బతిమిలాడి తనతో పాటు రాచనగరానికి తీసుకెళ్లాడు. నాగరాజు పనిలో పడిపోయాడు. నర్తనశాల కోసం కావాల్సిన శిల్పాలను చెక్కుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. మల్లీశ్వరికి రాణివాసంలో ఉండటం కష్టంగా ఉంది. తల్లికి కబురుపంపి తీసుకుపొమ్మని గొడవ కూడా చేసింది. కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. అక్కణ్నుంచి బయటపడే ఏ మార్గమూ లేక, అంతఃపురమంతా కలియదిరుగుతూ నాగరాజును గుర్తు చేసుకుంటోంది మల్లీశ్వరి. సరిగ్గా అప్పుడే కనిపించాడు నాగరాజు ఆమెకు. అతనితో మాట కలిపేలోపే అంతఃపురంలోని చెలికత్తెలు మల్లీశ్వరిని లోపలికి తీసుకెళ్లారు. మల్లీశ్వరి రాణివాసం నుంచి బయటకొచ్చి నాగరాజును కలవలేదు. నాగరాజుకు మల్లీశ్వరిని చేరే అవకాశమే లేదు. కానీ ఇద్దరూ ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేని పరిస్థితి. ఒకరు లేకపోతే ఇంకొకరుఉండలేనంత ప్రేమ ఇద్దరిదీ. ఇద్దరూ ఒకరినొకరు చేరే దారి కోసం ఆనాటి నుంచి అన్వేషిస్తూనే ఉన్నారు. -
రంగ్‌దే తిరంగా...
హైదరాబాద్: వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరుగనున్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత బృందానికి ఒలింపిక్ కాంస్య పతక విజేత కరణం మల్లీశ్వరి, టెన్నిస్ ఆటగాడు విష్ణువర్ధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘రంగ్‌దే తిరంగా’ పేరిట సోనీ పిక్చర్స్ నెట్వర్క్ (ఎస్పీఎన్), తెలంగాణ క్రీడా జర్నలిస్టుల సంఘం (టీఎస్‌జేఏ) ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ... కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారులు ఈసారి 5 నుంచి 6 పతకాలు గెలిచే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అద్వితీయ విజయాలతో చరిత్ర సష్టించాలని ఆమె ఆకాంక్షించారు. అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన భారత బందం మరిన్ని పతకాలు తెస్తుందని 2010 ఆసియా క్రీడల టెన్నిస్ డబుల్స్ కాంస్య పతక విజేత అయిన విష్ణువర్ధన్ అన్నారు. ఎస్పీఎన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కేదార్ తేని మాట్లాడుతూ రంగ్‌దే తిరంగా... ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆటగాళ్లకు నైతిక మద్దతుగా నిలిచేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హ్యాండ్ ప్రింట్ చేపట్టిన క్యాంపెయిన్‌లో పలు రంగులతో కూడిన చేతి ముద్రలు వేసి సంఘీభావం తెలిపారు. -
స్త్రీజన హితం ఆయన అభిమతం
విశ్లేషణ హిందూ మతాచారాల చట్రంలో ఇరుక్కున్న స్త్రీకి హిందూ కోడ్ బిల్లు ద్వారా రాజ్యాంగ పరమైన రక్షణను కల్పించాలని అంబేడ్కర్ భావించారు.‡రాజేంద్రప్రసాద్, వల్లభ్‌భాయ్ పటేల్ తదితరులు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మతతత్వ, సాంప్రదాయక వాదులు ఆయన కు హిందూ వ్యతిరేకి, భారత వ్యతిరేకి ముద్రలు వేశారు. దీంతో పార్లమెంటులో ఆ బిల్లు రెండుసార్లు విఫలమైంది. అయినా అప్పట్లో తీవ్ర స్థాయిలో జరిగిన చర్చలు తర్వాతి కాలంలో స్త్రీ పురుష సమానత్వం దిశగా మేధోవర్గాల పోలరైజేషన్‌కు దారితీశాయి. ‘‘మహిళా పురోగమనం స్థాయితోనే నేను సమాజ పురోగమనాన్ని కొలుస్తాను’’ – డా: బి. ఆర్. అంబేడ్కర్ స్త్రీల విషయంలో అంబేడ్కర్ ఏం ఆలోచనలు చేశారు, వాటిని ఎలా ఆచరణ రూపంలోకి తీసుకువచ్చారు, వాటివల్ల మానవ సమూహానికి, ముఖ్యంగా స్త్రీలకి ఎలాంటి ప్రయోజనాలు చేకూరాయి అన్న ప్రశ్నలకు శిఖరాయమాన సమాధానం,‘హిందూ కోడ్ బిల్’. పీడితుల పట్ల అంబేడ్కర్‌కి ఉన్న శ్రద్ధ, నిబద్ధత, పట్టుదల, క్రాంతదర్శనత్వాలకూ, న్యాయశాస్త్ర పరిజ్ఞానానికీ హిందూ కోడ్ బిల్ గొప్ప ఉదాహరణ. ఈ ప్రతిపాదనకి ముందు ఆయన భారత సమాజంలో స్త్రీల స్థితిగతులపై విస్తృతమైన అధ్యయనం చేశారు. అంబేడ్కర్ జీవితంలోనే కాదు, భారతీయ స్త్రీల ప్రస్థానంలోనే గొప్ప ప్రతిపా దనగా పరిగణించదగిన ఈ బిల్లు పూర్వాపరాలు, స్త్రీల సమస్య మూలాలను అన్వేషించడానికి అంబేడ్కర్ చేసిన కృషి ఆసక్తికరం. మనుస్మృతే అణచివేతకు మూలం ఏ కులంలోనైనా దాని పరిరక్షణ జరిగేది స్త్రీల ద్వారానే అన్నది అంబేడ్కర్ మౌలిక ప్రతిపాదన. కులాన్ని నిలబెట్టడానికి స్త్రీల మీద విపరీతమైన నియం త్రణ అమలవుతుంది. స్త్రీ సమస్య మూలాలు కులంలో ఉన్నపుడు, కుల నిర్మాణం పటిష్టంగా ఉన్నంత కాలం స్త్రీల సమస్యలు తీరవు. కుల వ్యవస్థ కొనసాగింపునకు ముఖ్యకారణం వివాహవ్యవస్థ. భారతీయ సమాజాల్లో పెళ్లిళ్లు సాధారణంగా ఒకే కులంలో, తరచుగా దగ్గరి సంబంధాల్లో జరుగు తాయి. భర్త మరణించినపుడు స్త్రీ మరో వివాహం చేసుకోవడానికి వేరే కులాన్ని ఎంచుకుంటే కులసంకరం కావడంతో పాటు భర్తద్వారా సంక్రమించే ఆస్తి వేరే కులానికి బదిలీ అవుతుంది. అందుచేతనే సతీ సహగమనం, పాతి వ్రత్యం, తప్పనిసరి వైధవ్యం స్త్రీలు పాటించవలసి వచ్చింది. తమ కులం, తమ ఆస్తి పోకుండా ఉండటానికి స్త్రీల నిష్పత్తి పురుషులతో సమానంగా ఉండాలి. అట్లా ఉండటం కోసం వ్యవస్థ స్త్రీలకి విధించిన అమానవీయ ఆచా రాలు పోవాలని అంబేడ్కర్ గుర్తించారు. పితృస్వామిక వ్యవస్థలో పురుషుడే నిర్ణయాధికారి కనుక ఏ నియమం రూపొందినా అది పురుషుడి ప్రయోజనా లకు అనుగుణంగానే ఉంటుంది. కులాన్ని రక్షించడం కోసం స్త్రీలకు కఠిన నిబంధనలు అమలుచేసిన వ్యవస్థ పురుషుడికి ఎటువంటి నియమావళిని ప్రకటించలేదు. స్త్రీ పురుష నిష్పత్తిని సమానంగా ఉంచడం కోసమే ఇవన్నీ చేసినపుడు, అందులో పురుషుడు భాగస్వామి కాకుండా ఎలా ఉంటాడని ప్రశ్నించాడు అంబేడ్కర్. స్త్రీల అణచివేతకి మనుస్మృతి ప్రధాన కారణమని, స్త్రీలు, దళితులు, బానిసలను మనుస్మృతి హీనంగా చూసిందని, అంటరానితనాన్ని, హక్కుల రాహిత్యాన్ని, స్వేచ్ఛారాహిత్యాన్ని, నిర్ణయాధికారం లేకపోవడాన్ని బలవం తంగా అంటగట్టిందని ఆయన నిరూపిస్తారు. స్త్రీలని శూద్రుల కన్నా మృదు వుగా ఏ మాత్రం చూడలేదని, వారిని ఒకే గాటన కట్టిందని చెప్తారు. మను స్మృతిని క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే స్త్రీల జీవితాల్లో రావలసిన మార్పుల కోసం చేపట్టవలసిన సంస్కరణలకి, వాటి చట్టబద్ధతకి కృషి చేశారు. అయితే ఈ అధ్యయనంలో తులనాత్మకతకి ప్రాధాన్యతని ఇచ్చారు. మనువు నిర్ణ యించిన స్త్రీల హోదాకు, అంతకు మునుపటి సమాజాల్లో స్త్రీల హోదాకు మధ్యనున్న వ్యత్యాసాలను అంబేడ్కర్ వివరంగా చర్చించారు. వివాహం, ఆస్తి, సంతానం మొదలైన విషయాల్లో మనువు కంటే పూర్వకాలానికి చెందిన కౌటిల్యుడు పురోగామి దృక్పథంతో ఉన్నాడంటూ అనేక ఉదాహరణలు ఇచ్చారు. మనువులా ద్వంద్వ న్యాయవిధానం పాటించక స్త్రీతో సమానంగా పురుషుడు కూడా నియమాలు పాటించడం, అతిక్రమణకు శిక్షార్హుడు కావడం కనబడుతుంది. స్త్రీల వైవాహికహక్కులు, ఆర్థికస్వాతంత్య్రం, న్యాయపరమైన హక్కులను విపులంగా చర్చించిన కౌటిల్యుని అర్థశాస్త్రం మనుధర్మ శాస్త్రం కన్నా ఎంత మెరుగ్గా ఉందో చాలాచోట్ల చర్చించారు. అంబేడ్కర్ అభి ప్రాయాల ప్రకారం,‘బౌద్ధాన్ని పాటించగలిగే నిబద్ధత, క్రమశిక్షణ స్త్రీలకి మాత్రమే ఉందని బుద్ధుని విశ్వాసం’. బౌద్ధాన్ని అర్థం చేసుకోలేని కొందరు భిక్షువులు స్త్రీ వ్యతిరేకులుగా వ ూరారు. స్త్రీల సౌందర్యం పురుషులను వ్యామోహంలోకి నెడుతుందని బుద్ధుడు భావిస్తే, అత్యంత సౌందర్యవతి అయిన ఆమ్రపాలి సేవలను తీసుకునేవారే కాదంటారు అంబేడ్కర్. జెండర్–కులం–వర్గం సంబంధం జెండర్, కులం, వర్గాల మధ్యనున్న సంక్లిష్ట సంబంధాన్ని చర్చించిన భారతీయ తత్వవేత్తల్లో అంబేడ్కర్ ఒకరు. దళితులు, మహిళలు ఒకేరకంగా బాధితులైతే స్త్రీల మధ్య ఉన్న కుల అంతరాల సంగతి ఏమిటి అన్న ప్రశ్న సహజం. ‘కులం దడి కట్టుకున్న వర్గం’ అన్నది అంబేడ్కర్ ప్రసిద్ధ వాక్యం. కుల వర్గసంబంధాలను నిర్వచిస్తూ – ఒకే కులానికి చెందినవారి మధ్య వర్గ అం తరాలు ఉన్నట్లే, ఒకే వర్గానికి చెందిన వారిమధ్య కుల అంతరాలు కూడా ఉంటాయన్నారు. దీన్ని జెండర్‌కు కూడా అన్వయించుకోవచ్చు. ఒకే జెండర్‌లో కుల వర్గ అంతరాలు కూడా ఉంటాƇ ుు. ఆ అంశం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మాట్లాడి ఉండకపోవచ్చు. కానీ ఆయన దృష్టిలో నిచ్చెనమెట్ల సమాజపు అంతరాలలో దళిత స్త్రీలు అదనపు బాధితులు. మహిళల్ని కులాన్ని నిలిపే వాహికలుగా వాడుకున్నంత కాలం కులం పోదు, స్త్రీ సమస్యలూ తీరవు. వర్ణాంతర కులాంతర మతాంతర వివాహాలు దీనికి విరుగుడుగా ప్రతిపా దించారు. న్యాయవాది అయిన అంబేడ్కర్ స్త్రీల హక్కుల రంగంలో వేసిన ముద్ర అసామాన్యం. ఒక హక్కు చుట్టూ దాన్ని భంగపరిచే శక్తులు ఎన్ను న్నాయో ఆయనకి చాలా ఎరుక. హిందూ కోడ్ బిల్లు రూపొందించడానికి ముందు స్త్రీ ఎటువంటి వివక్షకి గురవుతుందో తెలుసుకోవడా నికి చాలా కస రత్తు చేశారు. ఆస్తిహక్కు విషయంలో భార్యకు జరిగే అన్యాయానికి ఉదాహ రణగా అంబేడ్కర్ ఒక విషయం చెప్పారు. సాధారణ న్యాయంలో భార్యాభర్త ఒకే యూనిట్. పెళ్లవగానే భార్య ఆస్తి, భర్త ఆస్తిలో కలసిపోతుంది. ఆమె చనిపోయిన తర్వాత ఆ ఆస్తి పూర్తిగా అతనికే చెందుతుంది. భర్త భార్యతో ఒప్పందానికి వచ్చి కొంత భాగాన్ని ఆమెకి ఇవ్వడానికి కూడా వీలులేదు. ఎందుకంటే వారిద్దరి ఉనికి ఒకటే. ‘ఆమె ప్రత్యేక, లేదా పూర్తి ఉపయోగం కోసం’ అన్న మాటల్ని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ చేర్చి వివాహిత స్త్రీకి ఆస్తిని ఇచ్చినట్లయితేనే ఆ ఆస్తిపై భర్త నియంత్రణ తొలగుతుంది. అయితే భర్త, భార్యని ప్రోత్సహించో లొంగదీసో ఆమె ఆస్తిని మార్పిడి చేయిస్తాడన్న భయంతో ‘సదరు చర్యని నిరోధించ డానికి’ అన్న వాక్యాన్ని వివాహ ఖరారు నామాల్లో చేర్చడం జరిగింది. దీని వల్ల స్త్రీ తన ఆస్తిని అనుభవించగలదే కానీ దాన్ని అమ్మడానికి, అన్యాక్రాంతం చేయడానికి హక్కు లేదు. ఇలాంటి అతి సూక్ష్మమైన విషయాలని కూడా జల్లెడ పట్టి ఆయన హిందూ కోడ్ బిల్లుని రూపొందించారు. మహిళా శ్రామిక సంక్షేమ నిధి, మహిళా శ్రామిక రక్షణ చట్టం, మహిళలకు ప్రసూతిపరమైన సదుపాయాల బిల్లు, పని ప్రదేశాల్లో జీతం చెల్లింపుల్లో లింగవివక్షను అరికట్టే న్యాయ సూత్రం, గనుల్లో తవ్వకాలు సాగించే మహిళల క్షేమం కోసం రూపొం దించిన బిల్లులాంటి అనేక బిల్లులు, న్యాయసూత్రాలను ఆయన తన జీవిత కాలంలోనే వెలుగులోకి తెచ్చారు. నెరవేరని కల ‘హిందూ కోడ్ బిల్లు’ నాలుగేళ్ల అధ్యయన సారాంశంగా 1947 ఏప్రిల్ 11న హిందూ కోడ్ బిల్లుని అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తు ముందు ప్రవేశపెట్టారు. స్త్రీల ఆస్తి హక్కు, కుమార్తెలకి ఆస్తిలో భాగం, వితంతువులకి సం పూర్ణహక్కులు, సాంప్రదా యక వివాహాల్లో విడాకుల హక్కు, మోనోగమీకి స్త్రీ పురుషులిద్దరూ బద్ధులు కావడం వంటివాటి మీద ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. బొంబాయి వంటి నగరాల్లో తప్ప బెంగాల్, మద్రాసు, పాట్నా, లాహోర్, అలహాబాద్, నాగ్‌పూర్ వంటి చోట్ల మెజారిటీ ప్రజలు బిల్లుపట్ల వ్యతిరేకతని చూపారు. రాజ్యాంగ నిర్మాణసభలో రెండుసార్లు ఈ బిల్లు ఆమోదాన్ని పొందలేక పోయింది. హిందూ మతాచారాల చట్రంలో ఇరుక్కున్న స్త్రీకి హిందూ కోడ్ బిల్లు ద్వారా రాజ్యాంగబద్ధమైన రక్షణని ఇవ్వాలనుకున్న అంబేడ్కర్ కల నెర వేరలేదు. న్యాయశాఖా మంత్రిగా అంబేడ్కర్ 1951 ఫిబ్రవరి 5 న హిందూ కోడ్ బిల్లును పార్లమెంట్లో (అప్పటి లెజిస్లేటివ్ అసెంబ్లీ) ప్రవేశపెట్టారు. అది ఆమోదం పొందనందుకు బాధ్యత వహించి పదవికి రాజీనామా చేశారు. రాజేంద్రప్రసాద్, వల్లభ్‌భాయ్ పటేల్ వంటివారు బిల్లుని తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. సాంప్రదాయక మతతత్వ సంస్థలు, సాంప్రదాయకవా దులు ఆయనపై హిందూ వ్యతిరేకి, భారత వ్యతిరేకి అని ముద్రలు వేశారు. బిల్లుని నాలుగేళ్లు నానబెట్టి, చివరికి ఒక తంతుగా వివాహం, విడాకులకి సంబంధించిన నాలుగు క్లాజులను మాత్రం అంగీకరిద్దామని నెహ్రూ అనడం తనని కలిచివేసిందని ఆయన తన రాజీనామా లేఖలో చెప్పారు. చివరికి దానికీ సిద్ధపడ్డానని చెపుతూ ‘‘మొత్తం పోగొట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఒక్క భాగాన్నయినా దక్కించుకో’’ అనే సూక్తిని పేర్కొన్నారు. ఆ తర్వాత, తీవ్ర వ్యతిరేకత రావడం కారణాన మొత్తం బిల్లునే వదు లుకోవాలని నెహ్రూ చెప్పడం తనను దిగ్భ్రాంతిలో ముంచిందన్నారు. ఈ క్రమంలో తను అనుభవించిన మానసిక చిత్రహింసను కూడా ప్రస్తావిం చారు. వాగ్దానాలకి, ఆచరణలకి మధ్యనున్న దూరాన్ని ప్రశ్నిస్తూ తన రాజీనా మాతో ఎవరికి సంబంధం ఉన్నా లేకపోయినా తన అంతరంగపు సత్యానికి బాధ్యత వహిస్తున్నానని చెప్పారు. బిల్లు విఫలం అయినప్పటికీ జాతీయ కాంగ్రెస్‌లోనూ బైటా తీవ్రస్థాయిలో జరిగిన చర్చల వల్ల తదనంతర కాలంలో చాలా మేలు జరిగింది. స్త్రీ పురుష సమానత్వం దిశగా మేధోవర్గాల పోలరై జేషన్ జరిగింది. ఆచరణశీలి అంబేడ్కర్‌కు, ఇప్పటి అస్తిత్వ ఉద్యమాలకు మధ్య అధిగమించవలసిన అంతరం ఒకటుంది. ఆయన తను ప్రాతినిధ్యం వహించిన పీడితకులాల గురించి ఆలోచనలు చేసి, వారి ఎదుగుదలకు పునా దులు తీసి, ఊరుకోలేదు. అక్కడ నిలబడి స్వేచ్ఛా సమానత్వాలతో కూడిన సవ్యమైన జాతి నిర్మాణం కోసం పాటుబడ్డారు. అందుకు అవసరమైన చట్ట బద్ధ మార్పుల కోసం కృషి చేశారు. రాజ్యాంగ రచన, న్యాయవ్యవస్థలో మార్పులు, దేశ ఆర్థికవిధానం లాంటి ఉమ్మడి అంశాలమీద తనదైన ముద్ర వేశారు. కనుకనే అయన జాతి మొత్తానికి నాయకునిగా నిలిచిపోయారు. డా. కేఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త కథ, నవలా రచయిత్రి, కార్యదర్శి ప్రరవే (ఏపీ) ఈ–మెయిల్ : malleswari.kn2008@gmail.com -
సమూహమే మతమైపోతే...
సందర్భం ఏం చేసినా గుంపులో కొట్టుకుపోతుంది కనుకనే గుంపుకి తెగింపు ఎక్కువ. తాము చేసిన ఏ చర్యకీ సొంత బాధ్యత ఉండదన్న ధీమా. సమూహం కూడా ప్రశ్నించ వీలులేని ఒక మతంగా స్థిరపడుతున్నపుడు దానిని తప్పక ప్రశ్నించడానికి పూనుకోవాలి. ‘మనిషికో రుచి అంటే మాటలా! ఎక్కువమందికి ఏది నచ్చితే మిగతావాళ్లూ అదే తినాలి.’ ఇళ్లలో వండి వడ్డించేవారు తరచుగా అనేమాట ఇది. ఒక మనిషి ఇష్టాయిష్టాలని అందరి ప్రయోజనంలోనుంచి చూడట మనేది ఒక విలువగా కుటుంబం నుంచే మొదలవుతుంది. అక్కడ నుంచి అది విస్తరించని చోటు లేదు. వ్యక్తులుగా సాధించలేని అనేక విషయాలను మనుషులు గుమిగూడి సాధించారు. మానవ చరిత్ర పొడవునా ఈ విజయాలకు అత్యున్నత గౌరవం ఉంది. సమస్యలు ఎదురైనపుడు అందరొక్కటై చేసిన తిరుగుబాట్లు, విప్లవాలు, తోవ తెలియని చోట్ల చేయి చేయి కలిపి సాగించిన అన్వేషణలు, అనేక ఆలోచనలను కలిపి కుట్టి నిర్మించిన ఆవిష్కరణలు ఒకటా రెండా.. వేలఏళ్లుగా నాగరికతా ప్రస్థానంలో సమూహానిదే పై చేయి. అమెరికన్ రిపబ్లిక్ పతనమై కార్మికోద్యమం బలపడుతుందన్న ఆశతో కాల్పనిక నగరాలను వాస్తవిక పునాది మీద అల్లిన నవల ‘ఉక్కుపాదం’. తిరుగుబాటు చివరి దశలో–చింకిపాతలతో ముళ్ళవలే రేగిన జుత్తుతో లోతుకుపోయిన పొట్టలతో పగిలి కాయలు కట్టిన కాళ్ళూచేతులతో నడిచే అస్థి పంజరాలని నింపుకున్న ఒక బీదరికపు అల.. వీధుల్ని ముంచెత్తివేస్తూ రావడాన్ని జాక్ లండన్ ఎలా వర్ణించాడు! తమ కోసమే జీవితాలను త్యాగం చేసిన విప్లవ నాయకులను తోసుకుంటూ తమ కాళ్ళకింద పడినవారిని కసబిస తొక్కుకుంటూ ప్రాణభీతితో పరుగులు తీసినవారి నిస్సహాయ సమయాలను చదివినపుడు, పీడితుల్ని మానవీయంగా ఉండనివ్వని ఆ స్థితి పట్ల క్రోధం ఎంత ఉన్నా వారందరినీ గుండెలకి హత్తుకున్నాం. అయితే సమూహానికి ఎల్లప్పుడూ పీడిత ముఖమే ఉండదని చరిత్ర చెప్పింది. వర్తమానమూ చెపుతోంది. ఆధిపత్య కులపు స్త్రీలని ప్రేమించిన పాపానికి పునాది కులాల పురుషులని చిత్రవధ చేసి మరీ ప్రాణాలు తీసేది, సినీనాయికలో, డ్యాన్సర్లో నలుగురిలోకీ వచ్చినపుడు వారిని చాటుగా తడిమీ పామీ గిచ్చీ సంతోషపడేది, తమ ఆహా రపు అలవాట్లని కొనసాగించేవారి పెడరెక్కలు విరిచికట్టి వారి నోట మట్టి గొట్టేది, తక్కువ బట్టలు కట్టుకున్న స్త్రీకి బుద్ధి చెప్పడానికి, బట్టలన్నీ ఒలిచి నగ్నంగా ఊరేగిస్తూ సంస్కృతిని పరిరక్షించేది, ఈ సమూహపు మరో ముఖమే. సమూహపు అసలుముఖంపై నీలినీడలు కమ్ముకుని మరోముఖం భయపెడుతున్న దుర్మార్గపు రోజులివి. మూక విజ్ఞత ఏకరూపంలో ఉండదు. అనేక స్వభావాల మనుషుల వలన అడ్డుకట్ట లేని ప్రవాహంలా విశృంఖలంగా పారుతుంటుంది. ఆయా వ్యక్తుల విజ్ఞతని ప్రయోజనకరంగా మలిచి వారందరినీ ఏక తాటిమీదకి తెచ్చే బలమైన కామన్ అంశం ఏదో ఉండాలి. అందరి దృష్టి దాని వైపు మళ్ళించి ముందుకు నడిపే శక్తులు బలంగా ఉండాలి. అటువంటి ఉదాత్తత ఏమీ లేని సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఆధిపత్యాన్ని స్థాపించుకోవడానికి, తమకి భిన్నంగా కనిపించేదాన్ని తమకి నచ్చనిదాన్ని అణిచి వేయడానికి ఒక ఎజెండా నిర్మించుకునే సమూహాలు ఉంటాయి. ఈ ఎజెండాకి సహకరించడానికి వాలుకు కొట్టుకుపోయే మనుషులు, మాబ్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు సిద్ధంగా ఉంటారు. కడుపునిండా తిని కట్టుగుంజకి ఆనుకుని బద్ధకంగా నెమరువేసుకునే ఆవులా, మిగతా సమాజం ఈ ఆటని చూసీచూడనట్లు ఓరకంటితో వీక్షిస్తూ ఉంటుంది. సమూహం ఎప్పుడూ వైబ్రంట్గానే ఉంటుంది. మంచికి మంచి చేయడానికీ చెడుకి మంచి చేయడానికి కూడా. ఏం చేసినా గుంపులో కొట్టుకుపోతుంది కనుకనే గుంపుకి తెగింపు ఎక్కువ. తాము చేసిన ఏ చర్యకీ సొంత బాధ్యత ఉండదన్న ధీమా. బాధ్యత పడాల్సి వచ్చినా తప్పుని నలుగురితో కలిసి పంచుకుంటామన్న ధైర్యం. రక్షణ వ్యవస్థల అలసత్వం, అవసరమైతే ఈ శక్తులకి కొమ్ము కాయడం లాంటి వాటి వల్ల స్త్రీలూ, దళితులు, మైనార్టీ మతాలవారు సమాజంలో స్వేచ్ఛగా ఇప్పటికీ సంచరించలేని స్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిలో పుండు మీద కారం జల్లుతూ మతవాద శక్తులు వేగంగా ఏకీకృతం కావడం కొత్తబెదురుని సృష్టిస్తోంది. ఈ స్థితిని అదుపు చేసి సమూహాలకి బాధ్యత గుర్తుచేసే పనిని ఎవరు స్వీకరించాలి? తరగతి గదులు పిల్లలందరినీ కలిపి గుచ్చిన పూలమాలల్లాంటివి. వారు వ్యక్తులుగా వికాసం చెందుతూనే సమూహజీవులుగా ఎట్లా మెలగాలో ఉపాధ్యాయులు తాము తెలుసుకుని పిల్లలకి చెప్పాలి. ఇళ్ళు, ప్రయాణాలు, వినోద స్థలాలు, సంతలు, తిరునాళ్ళు, మాల్స్, సభలు సమావేశ మందిరాలు, ఎక్కడెక్కడ మనుషులు కూడుతారో అక్కడల్లా ఎవరి ప్రవర్తనకి వారు బాధ్యత పడాల్సిందేనని, సొంత విజ్ఞత ఉండాల్సిందేనని మనసు పదేపదే గుర్తు చేసేలా శిక్షణ సాగాలి. సమూహం కూడా చివరికి ప్రశ్నించ వీలులేని ఒక మతంగా స్థిరపడుతున్నపుడు దానిని తప్పక ప్రశ్నించడానికి పూనుకోవాలి. మెజారిటీ ఓటరు దేవుళ్ళ సమూహం నిర్ణయించిన నాయకులను నెత్తిన పెట్టుకోలేక నిరంతర ప్రతిపక్షంగా మారడం ఒక తిరుగుబాటు. అనేక ప్రేక్షక మహాశయుల అభిరుచి మేరకి తీసే వ్యాపార సినిమాలను చూడలేక, పుంజీడుమంది కూడా లేని స్లో మూవీ హాల్లో చప్పట్లు కొట్టడం ఒక సూటిప్రశ్న. ఎక్కువమంది పాఠకదేవుళ్ళ మెచ్చుకోళ్ళకి రోసి, నచ్చిన అక్షరాన్ని గుండెనుంచి పెకలించడమొక ఖలేజా. సంస్కృతీ పరిరక్షకులు. దేశభక్తులు, గుంపులో గోవిందమ్మలూ గోవిందయ్యలూ పాడే సామూహిక గీతాల ప్రకంపనలకు చెవులు మూసుకుని మైనారిటీ స్వరాన్ని అట్టడుగు నుంచి తెరవడం ఒక బాధ్యత. మన బాధ్యత. వ్యాసకర్త కార్యదర్శి, ప్రరవే (ఏపీ) ఈ–మెయిల్ : malleswari.kn2008@gmail.com డా. కేఎన్. మల్లీశ్వరి -
అవమాన భారంతో దంపతుల ఆత్మహత్య
హనుమంతపాడు: ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులకు తోడు అవమాన భారంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని హనుమంతపాడు మండలం కోటగుంట్లలో గురువారం ఉదయం వెలుగు చూసింది. జిల్లాలోని ఉలవపాడు మండలం మన్నేటికోట గ్రామానికి చెందిన కత్తి ఏడుకొండలు(35), మల్లేశ్వరి(31) దంపతులు కోటగుంట్లలోని బొగ్గుబట్టిలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఏడుకొండలు బొగ్గుబట్టి యజమానికి డబ్బు బాకి పడటంతో.. అతను గత కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం బొగ్గుబట్టిలో పని చేస్తున్న తన బంధవులందరి ముందు ఏడుకొండలును తీవ్రంగా కొట్టిన యజమాని.. డబ్బు చెల్లించకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అంగన్వాడీ కార్యకర్త మృతి
హిందూపురం అర్బన్ : పట్టణంలోని ఇందిరానగర్‌లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పని చేస్తున్న మల్లేశ్వరీ(46) అనే అంగన్వాడీ కార్యకర్త జేఈ వైరస్ సోకి గురువారం కర్ణాటక తుమకూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆమెకు ముగ్గురు సంతానం. పెద్దకుమార్తెకు ఇటీవల వివాహమైంది. 20 రోజుల క్రితం వాంతులు అధికం కావడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని స్థానిక వైద్యులు సూచించారు. దీంతో అటు నుంచి తుమకూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలో ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందింది. -
స్కూల్‌కి వెళ్లనని మారాం చేసిందని...
-
స్కూల్‌కి వెళ్లనని మారాం చేసిందని...
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రామసింగవరంలో దారుణం చోటు చేసుకుంది. రంగాపురం హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్న మల్లీశ్వరి తరచు స్కూల్‌కు వెళ్లనని మారాం చేస్తుంది. దీంతో విసిగిపోయిన తండ్రి రాజారత్నం ఆమె తీవ్రంగా కొట్టాడు. దాంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. కంగారు పడిన ఆమె తల్లిదండ్రులు వెంటనే ఆమెను గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. ఆమె కోమాలోకి వెళ్లిందని... చెప్పడంతో ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మల్లీశ్వరి అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయం గ్రామంలో తెలిస్తే ప్రమాదమని భావించిన ఆమె తల్లిదండ్రులు మరో మహిళ సహాయంతో గుట్టుచప్పుడు కాకుండా పూడ్చి పెట్టారు. అనంతరం తండ్రి రాజారత్నం పరారైయ్యాడు. ఇరుగుపొరుగు వారు మల్లీశ్వరి గురించి ఆరా తీస్తే... బంధువుల ఇంటికి వెళ్లిందని ఆమె తల్లి చెబుతుండేది. కానీ కుమార్తె మృతి విషయం బయటకుపొక్కడంతో స్థానికులు నిలదీశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మల్లీశ్వరి తల్లీతోపాటు ఆమెకు సహకరించిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా తండ్రి రాజారత్నం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన సెప్టెంబర్ 22వ తేదీన చోటు చేసుకుంది. -
మరో మహిళా టెకీ ఆత్మహత్య
హైదరాబాద్: మానసిక వ్యధతో మూడురోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాణీ మనీషా ఉదంతం మర్చిపోకముందే హైదరాబాద్ నగరంలో మరో మహిళా టెకీ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. నగరంలోని నలగండ్ల (చందానగర్)లో నివసిస్తోన్న మల్లీశ్వరి గచ్చిబౌలీలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. కొన్నాళ్ల కిందట సునంద కుమార్ మోహిత్ అనే వ్యక్తితో పెళ్లయింది. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. కొద్దికాలంగా భర్త సునంద కుమార్ మల్లీశ్వరిని వేధించడం మొదలుపెట్టాడు. చాలాసార్లు కుటుంబ పెద్దలకు ఫిర్యాదుచేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి చెందిన ఆమె.. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్లాట్ గదిలోని ఫ్యాన్ కు ఉరివేసుకుంది. సమాచారం అందుకున్న మల్లీశ్వరి బంధువులు ఫ్లాట్ల కు వెళ్లి పరిశీలించగా మృతురాలి మెడ, ముఖంపై గాయాలు కనిపించాయి. దీంతో భర్తే ఆమెను హత్యచేసి ఉంటాడని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. -
మోసం చేసిందనే మల్లీశ్వరిని చంపా: బాషా
అద్దంకి: 'భర్తను వదిలేసిన తర్వాత నాకు దగ్గరైంది. మొదట్లో అన్యోన్యంగానే ఉన్నాం. కానీ రానురానూ తాను విపరీతంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఎవరెవరితోనో మాట్లాడేది. ఎక్కడెక్కడికో వెళ్లేది. వద్దని ఎంత మొత్తుకున్నా వినేదికాదు. గట్టిగా అడిగితే నిన్నొదిలేసి హైదరాబాద్ వెళ్లిపోతానని బెదిరించేది. అంతే, పట్టలేని కోపంతో పక్కనున్న నవారు తీసుకొని తన గొంతు నులిమా' అంటూ మల్లేశ్వరిని ఎందుకు చంపాడో పోలీసులకు వివరించాడు బాషా. ప్రకాశం జిల్లా అద్దంకిలో సంచలనంరేపిన ఈ హత్యకేసు పూర్వాపరాల్లోకి వెళితే.. చీమకుర్తి మండలం పల్లమల్లి గ్రామానికి చెందిన మల్లీశ్వరి(25)కి అద్దంకి మండలం మనికేషం గ్రామానికి చెందిన రామారావుతో వివాహమైంది. చాలా ఏళ్ల కిందటే వారు విడిపోయారు. భర్తతో తెగదెంపుల అనంతరం కొత్తదామవారిపాలెంకు చేరుకున్న మల్లీశ్వరి అక్కడ ఒంటరిగా నివసిచసాగింది. ఈ క్రమంలో ముజావర్ పాలెంకు చెందిన బాషా(30) అనే వ్యక్తితో పరిచయమైంది. అదికాస్తా ప్రేమగామారి ఇరువురూ సహజీవనం చేస్తున్నారు. తనతో కలిసి ఉంటూనే మరికొందరితోనూ దగ్గరగా ఉంటోందని మల్లేశ్వరిపై అనుమానం పెంచుకున్నాడు బాషా. చాలాసార్లు హెచ్చరించి చూశాడు. శనివారం రాత్రి కూడా ఇరువురి మధ్య ఇదేవిషయంలో ఘర్షణ జరిగింది. తనను అనుమానిస్తే హైదరాబాద్ వెళ్లిపోతానని మల్లేశ్వరి బెదిరించింది. దీంతో కోపోద్రిక్తుడైన బాషా ఇంట్లో ఉన్న నవారుతో ఆమెకు ఉరి వేసి.. ఏమి తెలియనట్లు నటించాడు. తాను రావడానికి ముందే మల్లీశ్వరి ఉరి వేసుకుందని చుట్టుపక్కలవారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి బాషాను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా మల్లీశ్వరిని తానే చంపానని బాషా అంగీకరించాడు. దీంతో బాషాపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. -
మల్లీశ్వరి ఆత్మహత్య
చిత్తూరు : పాఠశాల నుంచి తిరిగొచ్చిన చిన్నారి ఇంట్లో ఎవరులేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది. వివరాలు.. మల్లీశ్వరి (11) స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. మల్లీశ్వరి తల్లిదండ్రులు కూలిపనుల కోసం వలస వెళ్లారు. బాలిక ఇంట్లో ఒక్కతే ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వచ్చాక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. ఆ క్రమంలో తీవ్రమైన కడుపు నొప్పి లేస్తోందని పక్కింటి వారితో చెప్పింది. దాంతో వారు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. ఆ వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మల్లీశ్వరి మృతి చెందింది. మల్లీశ్వరి మృతిపై ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మల్లీశ్వరి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సహచర విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు. -
నాన్న వెంటే నడిచి రైతునయ్యా..!
నేడు మహిళా రైతు దినోత్సవం వ్యవసాయం... అనగానే అది మగాళ్ల జోన్ అనుకుంటారు. మహిళలు రాణించే రంగం కాదనే అభిప్రాయం కూడా బలంగానే ఉంటుంది. లెక్కలేనంత మంది మహిళలు వ్యవసాయరంగంలో పని చేస్తుంటారు. వాళ్లెవరినీ రైతులనలేం. కానీ మహిళల్లో రైతులున్నారని నిరూపిస్తున్నారు గుంటూరుకు చెందిన మల్లీశ్వరి. ఆమె ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగుచేస్తున్నారు. వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్ బోధనలను అక్షరాలా పాటిస్తున్నారు. మహిళారైతు దినోత్సవం సందర్భంగా నేడు హైదరాబాద్‌లోని ఇక్రిశాట్లో జరుగుతున్న సదస్సులో ఆమె ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా సాక్షి ఫ్యామిలీతో... ‘‘మా అమ్మగారి ఊరు కృష్ణాజిల్లా తేలప్రోలు. నన్ను గుంటూరు జిల్లా నూతక్కిలో ఇచ్చారు. మా అమ్మానాన్నల పెళ్లయిన పదేళ్లకు పుట్టాను. దాంతో మా నాన్నగారికి నేనంటే గారం ఎక్కువ. ఆయన వెంటే తిప్పుకునేవారు. అలా పొలం వెళ్లడం అలవాటైంది. ఆయనపని చేస్తుంటే నేనూ చేలో దిగి ఆయన వెంటే తిరుగుతూ ఉండేదాన్ని. మా అత్తగారిది కూడా వ్యవసాయ కుటుంబమే. నాకు పెళ్లయిన ఈ పాతికేళ్లలో దాదాపుగా పదిహేనేళ్లు రసాయన ఎరువులతోనే పంటలు పండించాం. సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి పిండికట్టలు (రసాయన ఎరువులు) తగ్గించుకుంటూ వచ్చాం. అయినా గట్టెక్కడం కష్టమే అనుకుంటున్నప్పుడు వ్యవసాయాధికారులు వర్మీ కంపోస్టు గురించి చెప్పారు. దానిని ప్రయత్నించాం. అది కూడా చిన్న ఖర్చేమీ కాదు. అలా ఎదురీదుతున్నప్పుడు ప్రకృతి వ్యవసాయం గురించి తెలిసింది. విజయవాడలోని పోరంకికి 2008లో పాలేకర్ (సుభాష్ పాలేకర్) గారొచ్చారు. ఆయన సేద్యం గురించి చాలా సంగతులు చెప్పారు. ఆయన హిందీలో చెప్తుంటే చదువుకున్నోళ్లు తెలుగులో వివరించారు. ఆ సదస్సుకి మా ఆయన వెళ్లి, పాలేకర్ గారు ప్రకృతి సేద్యం గురించి రాసిన పుస్తకాలు (తెలుగు అనువాదాలు) తెచ్చారు. వాటిని చదివి అలాగే చేశాం. ఆ తర్వాత 2010లో పాలేకర్గారు గుంటూరులో సదస్సుకు వచ్చారు. ఆ సదస్సుకు నేను కూడా వెళ్లాను. రసాయన క్రిమిసంహారక మందులు, రసాయన ఎరువుల వల్ల నేల ఎంత నిస్సారమవుతుందో పూసగుచ్చినట్లు చెప్తుంటే మనసు కదిలిపోయింది. నేలను నమ్ముకుని బతికే వాళ్లం నేలతల్లిని బీడువారిస్తే తర్వాత ఏం తింటాం... అనిపించింది. ఏమైనా సరే ఇలాగే పండించాలనుకున్నాను. వెంటనే ఒక ఆవును కొన్నాం. ఆ ఆవు మాకు, మా ఆరెకరాల సేద్యానికీ ఆధారం. అభయ హస్తమిచ్చిన అరటి... ప్రకృతి సేద్యంలో మేమేసిన మొదటి పంట అరటి. మామూలుగా పండే పంటకంటే రెండు హస్తాలు ఎక్కువే వచ్చాయి. రుచి కూడా బాగుంది. ప్రకృతి వ్యవసాయంలో అరటికి ఎకరానికి ఏడెనిమిది వేల ఖర్చు వస్తుంది. గాలివానల వంటివి వస్తే చేయగలిగిందేమీ ఉండదు. కానీ విపత్తులు లేకుంటే రాబడి లక్షరూపాయలకు తగ్గదు. ఇప్పుడు మేము చెరకు, బొప్పాయితో పాటు అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నాం. రసాయన ఎరువులు వేయకుండా పండిన కూరగాయ కానీ పండు కానీ ఒకసారి తింటే... ఇక ఆ ఎరువులతో పండించిన వాటి జోలికెళ్లరు. నాకిప్పుడు 42 ఏళ్లు. పిల్లల ప్రసవాలప్పుడు తప్ప ఇప్పటి వరకు ఒక్క మందుబిళ్ల కూడా మింగలేదు. రసాయన ఎరువులతో చచ్చుబడిపోయిన మా పొలం ఈ సేద్యంతో గుల్లబారి సారవంతంగా మారింది. బూజు తెగులు, పేనుబంక తెగుళ్లకు ఆవుమూత్రం చల్లితే తెల్లారేసరికే గుణం కనిపిస్తుంది. ఇంట్లో కానీ పొలంలో కానీ చెదలు పడితే ఆవుమూత్రం కలిపిన నీటిని చిలకరిస్తే చాలు. ఆవు పేడ, ఆవు మూత్రం, నల్లబెల్లం, మినప్పిండి, మట్టి కలిపి 48 గంటల సేపు మురగబెడితే జీవామృతం తయారవుతుంది. దీంతోపాటు మేము ఏ రోజు పేడ ఆ రోజు పొలంలో చల్లేస్తాం. స్వయంగా చూడడంతోనే ధైర్యం! పాలేకర్గారు చెప్పిన మాటలు మాలో బాగా నాటుకున్నప్పటికీ మనసులో ఏదో భయం. కానీ మమ్మల్ని మహారాష్ట్రకు తీసుకెళ్లి అక్కడ రసాయన ఎరువులు వేసిన తోటలను, సహజ పద్ధతుల్లో పండించిన బత్తాయి, కమలా తోటలను చూపించారు. సహజపద్ధతుల్లో పండించిన చెట్లు నిగనిగలాడుతూ ఆకులు కూడా నేవళంగా (తాజాగా) కనిపించాయి. దాంతో మేమూ చేయగలమనే ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఈ సదస్సుకి అన్ని రాష్ట్రాల నుంచి నాలుగువందల మంది మహిళారైతులు వచ్చారు. నా అనుభవాలను చెప్పడంతోపాటు వారి అనుభవాలను నేను వింటే ఇంకా చాలా తెలుస్తాయి.’’ సంభాషణ: వాకా మంజులారెడ్డి -
ఒకే ఒక్క భారతీయ విదుషీమణి
- గొల్లపూడి మారుతీరావు, ప్రముఖ రచయిత, నటుడు నేను నా జీవితంలో ప్రత్యక్షంగా చూసిన మొదటి సినీ నటి - భానుమతి గారు. అది సరిగ్గా ఇప్పటికి 62 ఏళ్ళ క్రితం సంగతి. నాకు అప్పుడు పన్నెండేళ్ళు. విశాఖపట్నంలోని చిన్నం వారి వీధిలో ‘పూర్ణా పిక్చర్స్’ అధిపతి గ్రంథి మంగరాజు గారి ఇంటికి ఆమె వచ్చారు. మంగరాజు గారు ప్రసిద్ధ సినీ పంపిణీదారులు. విశాఖపట్నంలోని ‘పూర్ణా టాకీస్’ కట్టింది ఆయనే. అప్పుడే భానుమతి గారి ‘ప్రేమ’ (1952) చిత్రం విడుదలైంది. కారు దిగి, ఇంట్లోకి వెళుతున్న ఆమెను చూస్తే, ఒక మెరుపు తీగలా కనిపించింది. ఆ తరువాత నా జీవితంలో చాలామంది సినీ తారల్ని చూశాను. ఆ పైన నేనూ వాళ్ళలో ఒకణ్ణయ్యాను కానీ, అంత అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న నటీమణిని నేనెన్నడూ చూడలేదు. ముగ్ధుల్ని చేసే...ఆ ‘మల్లీశ్వరి’ దృశ్యం: భానుమతి గారి సినిమాలంటే, నాకు ఇప్పటికీ ఠక్కున గుర్తొచ్చేది - ‘మల్లీశ్వరి’ (1951). ఆ సినిమా నాటికి ఆవిడ ఓ 8 - 9 చిత్రాలు చేసి ఉంటారేమో! అందులో నాగరాజు పాత్ర పోషించిన (ఎన్టీ) రామారావు గారికి అది తొలి ఆరేడు చిత్రాల్లో ఒకటనుకుంటా! అప్పటికి రామారావు గారు తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌ను ఇంకా పట్టుకోని రోజులవి. ఆ సినిమా చూస్తుంటే, ఆవిడ బాడీ లాంగ్వేజ్‌కు ఏ మాత్రం దగ్గరగా రామారావు గారు కనిపించరు. అయితేనేం, అటు మల్లీశ్వరిగా భానుమతి గారు, ఇటు నాగరాజుగా రామారావు గారి జంట ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. నా జీవితంలో నేను ముగ్ధుణ్ణయిన ఒక్క షాట్‌ను చెప్పమంటే - ‘మల్లీశ్వరి’లోని ఒక ఘట్టం చెబుతాను. తిరునాళ్ళకు వెళ్ళి, నాగరాజు, మల్లీశ్వరి తిరిగి వస్తూ, వర్షం వల్ల ఒక మందిరంలో తలదాచుకున్నప్పుడు, రాయల వారు - తిమ్మరుసు మారువేషాల్లో చూస్తారు. మల్లికి రాణివాసం పల్లకీ పంపమని వాళ్ళతో నాగరాజు అంటాడు. అలా చెప్పినప్పుడు, అతణ్ణి వెక్కిరిస్తూ మల్లి ‘పంపించండి సామీ! రాణివాస ప్పల్లకీ!’ అని గమ్మత్తై కంఠంతో, హావభావాలతో చెబుతుంది. ఈ ఒక్క షాట్ కోసం - ‘మల్లీశ్వరి’ని చూడండి. ఇప్పటికే ‘మల్లీశ్వరి’ని చూసేసిన వాళ్ళు కూడా ఈ షాట్ కోసం మళ్ళీ ‘మల్లీశ్వరి’ని చూస్తే, నా అంత ముగ్ధులవుతారని ఆ సినిమా విడుదలైన ఇన్నేళ్ళ తరువాత ఈ 2014లో కూడా నేను ఢంకా బజాయించి చెప్పగలను. అదీ భానుమతి గారి ప్రతిభ. నటుడిగా నేను ఆమెకు లొంగిన క్షణం: అయితే, ఈ ఇమేజ్‌కు ఒక నెగటివ్ పార్శ్వం కూడా ఉంది. ఆవిడ ఎంత ఇండివిడ్యువలిస్టిక్ ఆర్టిస్ట్ అంటే, ఒక్క ‘మల్లీశ్వరి’ తప్ప, లేదా ‘మల్లీశ్వరి’కి ముందు వచ్చిన ఏ ‘స్వర్గసీమ’ (1945) లాంటి పిక్చర్లోనో తప్ప, మిగతా అన్ని సినిమాల్లోనూ, అన్ని పాత్రల్లోనూ ఒక్క భానుమతే కనిపిస్తుంది. భానుమతి అనే ఒక వ్యక్తిత్వం ఆమె చేసిన ఏ పాత్రకూ ఒదగలేదు. అందుకే, ఆవిడ భౌతికంగా వెళ్ళిపోయినప్పుడు నేను ‘కీ.శే. మల్లీశ్వరి అస్తమయం’ అని రాశాను. ఆవిడ ఏ పాత్రనూ, ఎదుట నటించే ఏ నటుడినీ తన కన్నా ఒక అడుగు ఎక్కువ ఎత్తున నిలబడనివ్వలేదు. దానికి ఉదాహరణ నా అనుభవమే. పన్నెండేళ్ళప్పుడు చూసినందుకే తన్మయుడినైన నేను, అలాంటి భానుమతి గారితో కలసి నటించే అవకాశం ఒకే ఒక్కసారి వచ్చింది - ‘మంగమ్మ గారి మనవడు’ (1984)లో! నేను స్వతహాగా రచయితను గనక, ఆమె డైలాగ్‌కు కౌంటర్‌గా నేను నా డైలాగ్‌ను మలుచుకొని చెప్పబోయాను. అంతే! ఆమె నవ్వుతూనే, ‘గొల్లపూడి గారూ! మీరు ఆ మాట అంటే, నేను మరో మాట అంటాను’ అని సున్నితంగా అన్నారు. నేను అభిమానించే నా సీనియర్ గనక, నా పాత్ర ద్వారా ఆమెకు లొంగిపోయాను. రచయితగా ఆమె చిత్రాలకు వేటికీ పని చేసే అవకాశం నాకు కలగలేదు. కానీ, వ్యక్తిగతంగా నేనంటే ఆమెకు ఎంతో గౌరవం ఉండేది. ఒకసారి మద్రాసులో శాస్త్రి హాలులో ఏదో సభ జరుగుతోంది. అందులో ఆమె ప్రసంగిస్తున్నారు. ఆమె మాట్లాడుతుండగా, నేను హాలులోకి వెళ్ళాను. భానుమతి గారు తన ప్రసంగం ముగిస్తూ, ‘నా తరువాత గొల్లపూడి మారుతీరావు గారు మాట్లాడతారు... నా కన్నా చాలా గొప్పగా’ అంటూ మైకు వదిలి వచ్చి, కూర్చున్నారు. అంత గౌరవం, అభిమానం, మాటలో చమక్కు చూపేవారు ఆవిడ. స్వాభిమానం మాటున మంచుముద్ద: ఒక వ్యక్తిగా చెప్పాలంటే, భానుమతి గారు ఎప్పుడూ తన ఒంటి మీద ‘స్వాభిమానం’ అనే అంగీని తొడుక్కొని ఉండేవారు. అది దాటి చూడగలిగితే, ఆమె ఆర్ద్రతతో, మంచు ముద్ద కాగలిగిన మంచి తల్లి. ఇది నాకు వారి అబ్బాయి డాక్టర్ భరణి కళ్ళ నిండా నీళ్ళతో స్వయంగా చెప్పిన విషయం. భానుమతి గారి లాంటి పెద్దావిడ ఒక వ్యక్తి సామర్థ్యానికి వాత్సల్యంతో లొంగిపోయిన సందర్భం నాకు తెలిసి - ఒకే ఒక్కటి! ఒకే ఒక్కరి విషయంలో! అది మా వాసు (చిన్నవయసులోనే కన్నుమూసిన యువ దర్శకుడు గొల్లపూడి శ్రీనివాస్). ‘మంగమ్మ గారి మనవడు’ చిత్రానికి మా వాసు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశాడు. ఆ కుర్రాడంటే విపరీతమైన అభిమానం ఆవిడకి! వాడి ఉత్సాహం, చురుకుదనం, ప్రతిభ చూసి ఆమె ఎంత ముచ్చటపడేవారో! ఆశ్చర్యం ఏమిటంటే, ఆవిడ మా ఇంటికి ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ, వాణ్ణి తన దగ్గరకు పిలిపించుకొనేవారు. వాసు ఆకస్మిక మరణం తరువాత ‘గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్’ ఏర్పాటు చేశాక, ఒక ఏడాది అవార్డు కార్యక్రమానికి భానుమతి గారిని పిలవడానికి వెళ్ళాను. అప్పటికే, ఆమె వార్ధక్యంలో ఉన్నారు. వయసు మీద పడ్డ సింహపు రాణిలా ఉన్నారు. ‘ఆ కుర్రాడంటే నాకు చాలా ఇష్టం. కానీ, నేను అంతసేపు కూర్చోలేను మారుతీరావు గారూ!’ అన్నారు. చిన్నప్పుడు నా కళ్ళ ముందు మెరిసిన మెరుపుతీగను అలా చూసేసరికి కళ్ళు చెమర్చగా, వెనక్కి తిరిగి వచ్చేశాను. సంప్రదాయాలు విడవని సినీ నటి: చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, అంత గొప్ప సినీ నటి అయినప్పటికీ, భానుమతి గారు సంప్రదాయానికి ఎప్పుడూ విడాకులు ఇవ్వలేదు. ఆవిడ పూజ గదిలో కుంకుమబొట్లు పెట్టిన వాళ్ళ అమ్మా నాన్న గార్ల ఫోటో నేను చూశాను. ఆమె భర్త - సినీ దర్శకుడు పి. రామకృష్ణారావు గారి ఫోటో నేను చూశాను. అంత పెద్ద నటి, తాను సినిమాల్లో నటించే రోజుల్లో కూడా శ్రావణ శుక్రవారాలకు కాళ్ళకూ, ముఖానికీ పసుపు రాసుకొనేవారని నిర్మాత బి. నాగిరెడ్డి గారి పెద్ద కూతురు నాతో స్వయంగా చెప్పారు. సినీ రంగానికి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి గారికి ఆమె ఒక మాట ఇచ్చిందట - ప్రతి సినిమాలోనూ తప్పనిసరిగా ఒక త్యాగరాయ కీర్తన పాడతానని! కర్ణాటక సంగీతం పట్ల, త్యాగరాజ స్వామి పట్ల, తన సంగీతం మీద ఎన్నో ఆశలు పెట్టుకొన్న తండ్రి గారి పట్ల ఆమెకున్న భక్తిప్రపత్తులకు ఇది నిదర్శనం. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో భానుమతిది ఓ చరిత్ర. నటన, రచన, సంగీతం, గానం, చిత్ర నిర్మాణం, దర్శకత్వం, స్టూడియో నిర్వహణ - అలా ఏకంగా 9 అంశాల్లో తనదైన ప్రతిభతో జాతీయ స్థాయిలో బహుమతులందుకొన్న ఒకే ఒక్క భారతీయ విదుషీమణి - పాలువాయి భానుమతి! -
కొండరెడ్డి గ్రామాల్లో ట్రైనీ ఐఏఎస్‌ల పర్యటన
కొటారుగొమ్ము(వీఆర్‌పురం), న్యూస్‌లైన్: మండలంలోని మారుమూల కొండరెడ్డి గిరిజన గ్రామాలు కొటారుగొమ్ము, పోచవరం తదితర గ్రామాల్లో మంగళవారం ట్రైనీ ఐఏఎస్‌లు పర్యటించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో మొత్తం 18 మంది ట్రైనీ ఐఏఎస్‌ల బృందం ఈ ప్రాంతంలోని గిరిజనుల జీవన విధానాన్ని, వారి ఆదాయ మార్గాలను, ప్రభుత్వం ద్వారా అందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. తొలుత వారు కొటారుగొమ్ము గ్రామంలో గిరిజనులతో సమావేశమై మాట్లాడారు. గ్రామంలో ఇటీవల నిర్వహించిన పెసా గ్రామసభ, గ్రామంలో అమలవుతున్న ఉపాధి హామీ పనులను గురించి ఎస్‌ఓపీటీజి మల్లీశ్వరి వారికి వివరించారు. అనంతరం గ్రామస్తులతో వారు మాట్లాడారు. అడవులను రక్షించుకోవాలని, తద్వారా పర్యావరణ సమతులంగా ఉంటుందని తెలిపారు అనంతరం స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని, పోచవరంలోని అంగన్వాడీ కేంద్రాన్ని, బాలబడి కేంద్రాలను సందర్శించి పిల్లలతో మాట్లాడారు. అక్కడి నుంచి బోట్లో తుమ్మిలేరు, కాకిసునూరు గ్రామాల మీదుగా పేరంటపల్లి చేరుకొని అక్కడి ప్రాచీన శివాలయాన్ని దర్శించుకున్నారు. అక్కడి గిరిజనుల ఆచార సంప్రదాయాలను తెలుసుకున్నారు. అలాగే గిరిజనులు వెదురుతో తయారు చేసి విక్రయించే వస్తువులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ శ్రీనివాస్, పీఎంఆర్‌డీ ఎన్.ప్రతిమ, ఎస్‌ఓపీటీజీ మల్లీశ్వరి, ఏటీడబ్ల్యూఓ సీతారాములు పాల్గొన్నారు.