మరో మహిళా టెకీ ఆత్మహత్య | due to husband harassment women software engineer commits suicide in chandanagar, hyderabad | Sakshi
Sakshi News home page

మరో మహిళా టెకీ ఆత్మహత్య

Published Sat, Mar 5 2016 3:37 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

మరో మహిళా టెకీ ఆత్మహత్య - Sakshi

మరో మహిళా టెకీ ఆత్మహత్య

హైదరాబాద్: మానసిక వ్యధతో మూడురోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాణీ మనీషా ఉదంతం మర్చిపోకముందే హైదరాబాద్ నగరంలో మరో మహిళా టెకీ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. నగరంలోని నలగండ్ల (చందానగర్)లో నివసిస్తోన్న మల్లీశ్వరి గచ్చిబౌలీలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. కొన్నాళ్ల కిందట సునంద కుమార్ మోహిత్ అనే వ్యక్తితో పెళ్లయింది. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు.

కొద్దికాలంగా భర్త సునంద కుమార్ మల్లీశ్వరిని వేధించడం మొదలుపెట్టాడు. చాలాసార్లు కుటుంబ పెద్దలకు ఫిర్యాదుచేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి చెందిన ఆమె.. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్లాట్ గదిలోని ఫ్యాన్ కు ఉరివేసుకుంది. సమాచారం అందుకున్న మల్లీశ్వరి బంధువులు ఫ్లాట్ల కు వెళ్లి పరిశీలించగా మృతురాలి మెడ, ముఖంపై గాయాలు కనిపించాయి. దీంతో భర్తే ఆమెను హత్యచేసి ఉంటాడని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement