
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. గోపన్ పల్లిలో ఓ వివాహిత ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త సంతోష్, అత్తామామల వేధింపుల వల్లే స్రవంతి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కంకణాల సంతోష్‌కు 2017 అక్టోబర్‌లో స్రవంతితో వివాహం జరిగింది. వీరు ప్రస్తుతం గోపన్ పల్లి ముప్పా అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల బాబు కూడా ఉన్నారు. పెళ్లైయినా ఏడాదిలోపే తనను భర్త, అత్తమామలు వేధిస్తున్నారని స్రవంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018 ఆగస్టులో ఈ కేసు నమోదైంది.(వికాస్ దూబే మరో సహచరుడు అరెస్టు!)
అప్పటి నుంచి కూడా భార్యభర్తల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి సైతం భర్త, అత్తమామలతో స్రవంతికి గొడవ జరిగినట్టు సమచారం. ఆ తర్వాత స్రవంతి ఒంటికి నిప్పంటించుకుని బలవనర్మణం చెందినట్టుగా సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు అక్కడికి చేరకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. స్రవంతి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.(లగ్నపత్రిక రాయించేందుకు వెళ్తూ..)
Comments
Please login to add a commentAdd a comment