self immolation
-
ఎవరో చేసిన తప్పుకి.. తనను తాను శిక్షించుకోవటం!
కోపం తెచ్చుకోవటం అంటే ఎవరో చేసిన తప్పుకి తనను తాను శిక్షించుకోవటం అని ఒక ఆంగ్ల సామెత ఉంది. దీనికి సమానార్థకంగా తెలుగులో కూడా ఒక సామెత ఉంది. ‘‘ఏ కట్టెకి నిప్పు ఉంటే ఆ కట్టే కాలుతుంది’’ అని. ఆలోచిస్తే రెండు ఎంత నిజమో కదా అనిపించక తప్పదు. సుమతీ శతకకారుడు కూడా అదే విషయాన్ని నిర్ధారించాడు – ‘‘తన కోపమె తన శత్రువు’’ అని. గొప్ప గొప్ప శాస్త్రీయమైన సత్యాలని సామాన్యమైన మాటల్లో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పటం అన్ని సమాజాలలో ఉన్న పెద్దలు చేసిన పని. వారికి రాబోయే తరాల మీద ఉన్న ప్రేమకి అది నిదర్శనం. గమనించండి! కోపం తెప్పించిన వారిని కానీ, పరిస్థితులని కానీ ఎవరైనా మార్చ గలరా? కోపానికి కారణమైన వారు బాగానే ఉంటారు. సమస్య కోపం తెచ్చుకున్న వారిదే.ఎవరికైనా కోపం ఎందుకు వస్తుంది? తనని ఎవరయినా తప్పు పట్టినా, నిందించినా, దెబ్బకొట్టినా (శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, భావోద్వేగాలపరంగా, సామాజికంగా), తాను అనుకున్నది సాధించలేక పోయినా ఇలా ఎన్నో కారణాలు. ఒక్క క్షణం ఆలోచించండి! వీటిలో ఏ ఒక్కటి అయినా మన అధీనంలో ఉన్నదా? లేనప్పుడు అనవసరంగా ఆయాస పడటం ఎందుకు? కోపపడి, ఆవేశ పడితే ఎడ్రినల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దానివల్ల ముందుగా శరీరంలో ఉన్న శక్తి అంతా ఖర్చు అయిపోతుంది.కోపంతో ఊగిపోయినవారు తగ్గగానే నీరసపడటం గమనించ వచ్చు. ఇది పైకి కనపడినా లోపల జరిగేది జీవప్రక్రియ అస్తవ్యస్తం కావటం. దానికి సూచనగా కళ్ళు ఎర్ర బడతాయి. కాళ్ళు చేతులు వణుకుతాయి, మాట తడబడుతుంది. ఆయాసం వస్తుంది. రక్త ప్రసరణలో మార్పు తెలుస్తూనే ఉంటుంది. పరీక్ష చేసి చూస్తే రక్త పోటు విపరీతంగా పెరిగి ఉంటుంది. ఇది తరచుగా జరిగితే ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తక తప్పదు. కోపం తెప్పించిన వారు మాత్రం హాయిగా ప్రశాంతంగా ఉంటారు. కోపాన్ని వ్యక్త పరిస్తే వచ్చే వాటిలో ఇవి కొన్ని. లోపలే అణుచుకుంటే వచ్చేవి మరెన్నో! ఎసిడిటీ, విరేచనాలు, మలబద్ధకం నుండి మధుమేహం, గుండె పోటు వరకు.తాను చేయని తప్పుకి ఈ శిక్ష ఎందుకు? మరేం చేయాలి? ఆలోచించి, కోపకారణాన్ని తెలుసుకోవాలి. మనని ఎవరైనా తప్పు పడితే – అది నిజంగా తప్పా? కాదా? అని తెలుసుకోవాలి. తప్పు అయితే సరిదిద్దుకోవాలి. (ఎత్తి చూపినవారికి మనసులోనైనా కృతజ్ఞతలు తెలుపుకుంటూ) తప్పు కాకపోతే, మనకి అనవసరం. అనుకున్నది సాధించ లేక తన మీద తనకే కోపం వస్తే, చేయలేక పోవటానికి ఉన్న కారణాలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఈ రకమైన విశ్లేషణ చేయటానికి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటం అవసరం. అందుకే అంటారు ఆవేశంలో నిర్ణయాలు తీసుకో కూడదు అని.మానవ మాత్రులం కనక కోపం రావటం సహజం. కానీ దానిని అదుపులో ఉంచుకుని, దానినే ఆయుధంగా ఉపయోగించుకుంటే అదే ఉపకరణంగా మారి లక్ష్యసాధనకి సహకరిస్తుంది. శ్రీరామచంద్రుడు కోపాన్ని అదుపులో ఉంచుకున్నాడు. అది ఆయన చెప్పు చేతల్లో ఉంది. రమ్మంటే వస్తుంది. ΄÷మ్మంటే పోతుంది. అందుకే ఆయనని ‘జితక్రోధుడు’ అన్నాడు వాల్మీకి. అవసరానికి కోపం వచ్చినట్టు కనపడాలి. దాని ప్రయోజనం దానికీ ఉంది.పిల్లలు అల్లరి చేస్తుంటే తల్లి కేకలు వేస్తుంది. అమ్మకి కోపం వచ్చింది అనుకుంటారు. నిజానికి అది కోపమా? ఇంతలో అత్తగారో, భర్తో పిలిస్తే మామూలుగానే మాట్లాడుతుంది. అమ్మవారి చేతిలో క్రోధము అనే అంకుశం ఉంది అని లలితారహస్యనామసాహస్రంలో ఉంది. అంటే తన అశక్తత మీద కోపం తెచ్చుకుని అనుకున్నది సాధించాలి అని అర్థం. ఇది కోపాన్ని ఆయుధంగా వాడటం. శత్రువుని సాధనంగా మలచుకుని ముల్లుని ముల్లుతోనే తీయటం. – డా.ఎన్. అనంతలక్ష్మి -
కర్ణాటక అసెంబ్లీ ఎదుట కుటుంబం ఆత్మాహుతి యత్నం
బెంగళూరు: బెంగళూరులోని కర్ణాటక అసెంబ్లీ ఎదుట ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆత్మాహుతి చేసుకునేందుకు ప్రయత్నించారు. రుణ బకాయిలను రికవరీ చేసేందుకు తమ ఇంటిని బ్యాంకు వేలం వేయడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు ఈ ఘటనకు పాల్పడ్డారు. కర్ణాటక అసెంబ్లీ బయట మహిళలు, పిల్లలతో సహా కుటుంబ సభ్యులు తమపై కిరోసిన్ పోసుకున్నారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో ప్రమాదం తప్పింది. బాధిత కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బెంగుళూరు సిటీ కోఆపరేటివ్ బ్యాంక్‌లో 2016లో అల్లం సాగు వ్యాపారం చేసేందుకు రూ.50 లక్షలు రుణం తీసుకున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ అల్లం వ్యాపారం నష్టాలను చవిచూసింది. దీంతో సహాయం కోరుతూ బాధిత కుటుంబం కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్‌ను ఆశ్రయించింది. లోన్ వడ్డీని తగ్గిస్తామని మంత్రి హామీ ఇచ్చినప్పటికీ బ్యాంకు అధిక రేట్లు విధిస్తూనే ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎమ్ఐలను తిరిగి చెల్లించడంలో కుటుంబం విఫలమైనందున బకాయిలను తిరిగి పొందేందుకు బాధితుల ఇంటిని బ్యాంకు అధికారులు వేలం వేశారు. దీనితో మనస్థాపానికి గురైన కుటుంబం అసెంబ్లీ ఎదుట ఆత్మాహుతి చేసుకోవడానికి పాల్పడ్డారు. రూ.3 కోట్ల విలువైన నివాసాన్ని కేవలం రూ.1.41 కోట్లకు బ్యాంకు అధికారులు వేలం వేశారని నిస్సహాయతను వెలిబుచ్చారు. ఇదీ చదవండి: మాల్దీవులు-భారత్ వివాదం ముగియాలంటే ఇదే మార్గం..! -
వ్యభిచారం చేయాలని నిర్మాత ఒత్తిడి.. నటి ఆత్మహత్యాయత్నం
సాక్షి, చెన్నై: చెన్నై డీజీపీ కార్యాలయం ఎదుట బుల్లితెర నటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. పరమేశ్వరి అలియాస్ భైరవి బుల్లితెర నటిగా ఉన్నారు. ఈమె ఈ నెల 25న పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. అందులో వేలూరుకు చెందిన రాజాదేసింగ్ అలియాస్ సుబ్రమణి తనకు సినీ నిర్మాతగా పరిచయమయ్యాడని, ఆ తరువాత షూటింగ్లో భాగంగా మయిలాడు దురైకు తీసుకెళ్లి గుడిలో తనను పెళ్లి చేసుకున్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో తనను వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించారు. నిందితుడిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ భైరవి సోమవారం చెన్నై డీజీపీ కార్యాలయానికి వెళ్లి తలపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమీపంలోని పోలీసులు ఆమెను కాపాడారు. చదవండి: రజనీకాంత్‌కి మరోసారి విలన్‌గా రమ్యకృష్ణ..? అయ్యో పాపం ‘చక్రి’ సోదరుడు.. సదరం కోసం ఎన్ని తిప్పలో.. -
కలకలం: సుప్రీంకోర్టు వద్ద నిప్పంటించుకుని ఇద్దరు ఆత్మహత్యాయత్నం
సాక్షి, న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కలకలం ఏర్పడింది. ఓ మహిళతో పాటు ఓ వ్యక్తి బలవన్మరణానికి యత్నించారు. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మంటలతోనే కోర్టు ఆవరణలోకి ప్రవేశించారు. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది వారి మంటలు ఆర్పేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సుప్రీంకోర్టు ప్రధాన ద్వారం గేట్ నంబర్ డీ వద్దకు సోమవారం ఉదయం ఓ మహిళ, ఓ వ్యక్తి వచ్చారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అనుమతించలేదు. ఐడీ కార్డు లేదా, ఏమైనా ధ్రువపత్రాలు ఉన్నాయా? అని అడగ్గా లేవని చెప్పడంతో సెక్యూరిటీ లోపలికి రానివ్వలేదు. దీంతో వారిద్దరూ అప్పటికప్పుడు నిప్పటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆర్పివేశారు. అనంతరం వారిని పోలీస్ వ్యాన్‌లో రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించినట్లు డీసీపీ దీపక్ యాదవ్ తెలిపారు. అయితే వారిద్దరూ ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు? అనే వివరాలు తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే బాధితులు తమకు న్యాయం జరగడం లేదనే ఆవేదనతో బలవన్మరణానికి యత్నించారని తెలుస్తోంది. -
నాలుగేళ్ల ప్రేమ.. ప్రియుడికి మరొకరితో పెళ్లి నిశ్చయం.. దీంతో..
సాక్షి, మద్దిరాల (సూర్యాపేట) : ప్రేమ విఫలమై ఓ యువతి బలవన్మరణానికి పాల్పడడంతో మండల పరిధిలోని ముకుందాపురంలో విషాదం అలుముకుంది. స్థానికులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ముకుందాపురం గ్రామానికి చెందిన గాడ్దుల రామచంద్రు, లక్ష్మమ్మ దంపతుల నాలుగో కుమార్తె ఉమ(22) హైదరాబాద్‌లో బీ ఫార్మసీ చదువుతోంది. లాక్డౌన్ కావడంతో స్వగ్రామం వచ్చింది. నాలుగేళ్లుగా అదే గ్రామానికి చెందిన నర్సింగ్ ఉమేష్, ఉమ ప్రేమించుకుంటున్నారు. కాగా, ఉమేష్‌కు మరో యువతితో కుటుంబ సభ్యులు వివాహం నిశ్చయించారని తెలుసుకుని మనస్తాపానికి గురైంది. దీంతో సోమవారం హైదరాబాద్‌కు వెళ్లింది. గదిలో ఒంటరిగా ఉంటున్న ఉమ ప్రేమ విఫలమైందన్న దిగులుతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున యువతి తలుపు తీయకపోవడంతో ఇంటి యజమాని చూసి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందజేసినట్లు తెలిపారు. చదవండి: బుల్లెట్ కోసం టెక్కీ ఆత్మహత్య -
ఘోరం: చితి పేర్చుకుని రైతు సజీవదహనం
దుబ్బాకటౌన్ / తొగుట (దుబ్బాక): ఏళ్లుగా ఉన్న ఊరిని, సొంత ఇంటిని విడిచి పోతున్నానని తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా భావిస్తున్న ఓ రైతు.. కూల్చివేసిన తన ఇంట్లోనే చితిలో సజీవ దహనమై కన్పించాడు. ఈ హృదయ విదారక ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్నసాగర్ ముంపు గ్రామం వేములఘాట్‌లో చోటుచేసుకుంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇల్లు కేటాయించలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తుండగా.. అధికారులు మాత్రం ఆయనకు భూమి, ఇల్లుకు సంబంధించిన నష్టపరిహారంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించిన చెక్కులను కూడా అందజేసినట్లు చెప్పారు. రెండు నెలలుగా అద్దె ఇంట్లో.. తొగుట ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు .. వేములఘాట్ గ్రామానికి చెందిన తూటుకూరి మల్లారెడ్డి (70) రైతు. అతని భార్య అమృతమ్మ కొన్ని నెలల క్రితం చనిపోయింది. మల్లారెడ్డికి వివాహాలైన ముగ్గురు కుమార్తెలు ఉండగా.. ఇల్లరికం ఉన్న పెద్ద అల్లుడు భగవాన్‌రెడ్డి, కుమార్తె కొన్నేళ్ల క్రితమే అనారోగ్యంతో మరణించారు. వీరికి ఉన్న ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు మల్లారెడ్డితోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి మనవరాళ్లకు సైతం వివాహం జరిపించి అత్తగారింటికి పంపించాడు. అయితే 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం.. ముంపు గ్రామమైన వేములఘాట్‌ను ఖాళీ చేయించే పనికి పూనుకుంది. దీంతో మల్లారెడ్డి కూడా మిగతా గ్రామస్తుల మాదిరిగానే తనకున్న వ్యవసాయ భూమిని, ఇంటిని అప్పగించాడు. సాగర్ నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకోవడంతో అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అధికారులు మల్లారెడ్డి ఇంటిని కూల్చివేశారు. దీంతో రెండు నెలల క్రితం చిన్న కూతురు భాగ్యలక్ష్మి, అల్లుడితో కలిసి గజ్వేల్ మండలం పిడిచెడ్ గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఇల్లు చూసి వస్తానని చెప్పి.. ఈ నేపథ్యంలోనే.. కూల్చిన ఇల్లు పరిస్థితి ఏ విధంగా ఉందో చూసి వస్తానని కుమార్తెతో చెప్పిన మల్లారెడ్డి పిడిచెడ్ నుంచి గురువారం మధ్యాహ్నం వేములఘాట్ చేరుకున్నాడు. రాత్రి 9.30 వరకు చుట్టు పక్కల ఇళ్ల వారితో మాట్లాడాడు. రాత్రి 10.00 గంటలకు కుమార్తె ఫోన్ చేస్తే.. మోకాళ్లు నొప్పిగా ఉన్నాయి, ఉదయం అల్లుడిని పంపిస్తే బైక్‌పై వస్తానని చెప్పాడు. అర్ధరాత్రి చుట్టుపక్కల వారు నిద్రపోయాక కూల్చివేసిన తన ఇంట్లోనే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం కూతురు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె చుట్టు పక్కల వారికి ఫోన్ చేసింది. వారు వెళ్లి చూడగా కట్టెల్లో కాలిపోయి కన్పించాడు. దీనిపై మల్లారెడ్డి మనవడు తిరుపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొగుట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట ఆర్డీఓ అనంతరెడ్డి మాట్లాడుతూ పుట్టి పెరిగిన గ్రామం నుంచి, ఇంటి నుంచి వెళ్లిపోతున్నాననే మనస్తాపంతో మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని తెలిపారు. పోలీసులు కూడా ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఇల్లు కేటాయించలేదని..! అయితే పరిహారం కింద మల్లారెడ్డికి గజ్వేల్ శివారులో నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలో అధికారులు ఇల్లు కేటాయించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇల్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో పాటు సర్పంచ్‌ను మల్లారెడ్డి పలుమార్లు వేడుకున్నా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితం అధికారులు ఇళ్ల కోసం తయారు చేసిన లిస్టులో 715 నంబర్‌గా మల్లారెడ్డి పేరు ఉన్నప్పటికీ ఇల్లు మాత్రం కేటాయించలేదని తెలిపారు. తనకు ఇల్లు లేకుండా పోయిందనే మనస్తాపంతోనే కట్టెలతో చితిని పేర్చుకొని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు. -
హైదరాబాద్‌లో వివాహిత బలవన్మరణం
-
హైదరాబాద్‌లో వివాహిత బలవన్మరణం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. గోపన్ పల్లిలో ఓ వివాహిత ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త సంతోష్, అత్తామామల వేధింపుల వల్లే స్రవంతి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్వేర్ ఉద్యోగి కంకణాల సంతోష్‌కు 2017 అక్టోబర్‌లో స్రవంతితో వివాహం జరిగింది. వీరు ప్రస్తుతం గోపన్ పల్లి ముప్పా అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల బాబు కూడా ఉన్నారు. పెళ్లైయినా ఏడాదిలోపే తనను భర్త, అత్తమామలు వేధిస్తున్నారని స్రవంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018 ఆగస్టులో ఈ కేసు నమోదైంది.(వికాస్ దూబే మరో సహచరుడు అరెస్టు!) అప్పటి నుంచి కూడా భార్యభర్తల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి సైతం భర్త, అత్తమామలతో స్రవంతికి గొడవ జరిగినట్టు సమచారం. ఆ తర్వాత స్రవంతి ఒంటికి నిప్పంటించుకుని బలవనర్మణం చెందినట్టుగా సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు అక్కడికి చేరకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. స్రవంతి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.(లగ్నపత్రిక రాయించేందుకు వెళ్తూ..) -
‘12 మందిమి ఆత్మహత్య చేసుకుంటాం’
పట్నా : రాహుల్ గాంధీ తన రాజీనామాను వెనక్కి తీసుకోకపోతే మూకుమ్ముడి ఆత్మహత్యలకు పాల్పడతామంటున్నారు బిహార్ కాంగ్రెస్ కార్యకర్తలు. వివరాలు.. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాహుల్ బిహార్ వెళ్లారు. గతంలో రాహుల్‌పై బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ పరువునష్టం కేసు వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్ పట్నా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. దీనిపై విచారణ జరిపిన పట్నా కోర్టు శనివారం ఆయనకు రూ.10 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అయితే రాహుల్ రాక గురించి తెలిసిన కార్యకర్తలు రాజీనామాను ఉపసంహరించుకునేలా ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు పట్నాలో పోస్టర్లు ఏర్పాటు చేశారు. రాహుల్ రాజీనామాను ఉపసంహరించుకోకపోతే జులై 11న 12 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా ఆత్మహత్యలకు పాల్పడతామని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. -
రైల్వే స్టేషన్లో యువకుడి అఘాయిత్యం
న్యూఢిల్లీ : నగరంలోని సకుర్ బస్తీ రైల్వే స్టేషన్లో సిక్కు యువకుడు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంటల్లో కాలిపోతున్న యువకుడిని చూసిన సహచర ప్రయాణీకులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించకుండా ఫోన్లలో ఘటనను చిత్రీకరించారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడు గంట సమయం ముందే రైల్వే స్టేషన్‌కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. బ్యాగులో వెంటతెచ్చుకున్న కిరోసిన్ బాటిల్‌ను ఓపెన్ చేసి మీద పోసుకుని నిప్పటించుకున్నట్లు రైల్వే పోలీసులు చెప్పారు. యువకుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
'గే' అంటూ ఏడిపించారని.. ఆత్మాహుతి యత్నం
స్నేహితులతో సన్నిహితంగా ఉన్నందుకు తనను 'గే' అంటూ ఏడిపించారని.. ఇంటర్ విద్యార్థి డీజిల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మాహుతి యత్నం చేశాడు. మంటల బాధ తాళలేక అరుచుకుంటూ రూంలోంచి బయటకు పరుగులు తీసిన అతడిని కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగులు చూసి, అతడిమీద నీళ్లు పోశారు. దుప్పట్లు కప్పి.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడికి 40 శాతం కాలిన గాయాలయ్యాయి. ఈ ఘటన ఆగ్రా నగరంలో జరిగింది. బాలుడి కాళ్ల మీద, ఎద భాగంలో బాగా కాలినట్లు వైద్యులు చెప్పారు. అతడు సరిగా మాట్లాడలేకపోతున్నాడని, డాక్టర్లు అంతా బాగానే ఉందని చెబుతున్నా, తన కొడుకు మళ్లీ తనతో మాట్లాడితేనే నమ్ముతానని బాధితుడి తండ్రి అంటున్నారు. పదోతరగతిలో మంచి మార్కులతో పాసైన ఆ కుర్రాడు.. ఇంజనీరింగ్ చదవాలని కలలు గంటున్నాడు. రెండురోజుల క్రితం దగ్గర్లో ఉన్న పార్కులో స్నేహితుడితో కలిసి ఉండగా.. పొరుగున ఉండే ఓ వ్యక్తి చూసి, ఈ కుర్రాడిని 'గే' అంటూ ఏడిపించాడు. ఆ విషయం చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది. ప్రతి ఒక్కరూ అతడిని ఏడిపించడం మొదలుపెట్టారని అతడి తండ్రి చెప్పారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురై రెండు రోజులుగా తన రూంలోనే ఉండిపోయాడని, ఉన్నట్టుండి గదిలోంచి పరుగున బయటకు వచ్చాడని.. తీరా చూస్తే అప్పటికే మంటలు బాగా వ్యాపించాయని ఆయన తెలిపారు. ఆ కుర్రాడు కాలనీలో పార్క్ చేసి ఉన్న కారులోంచి డీజిల్ తీసి.. దాన్నే తనపై పోసుకున్నట్లు చెబుతున్నారు. -
అసెంబ్లీ వద్ద యువకుడి ఆత్మాహుతియత్నం
-
టికెట్టు ఇవ్వకపోతే చచ్చిపోతా.. జాగ్రత్త!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పార్టీ టికెట్ ఇవ్వాలంటూ ఆర్జేడీ ఎమ్మెల్యే భాయి దినేష్ శనివారం నిరాహార దీక్ష ప్రారంభించారు. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే మాత్రం.. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానని బెదిరించారు. టికెట్ ఇవ్వని పక్షంలో ఆదివారం నాడు పార్టీ కార్యాలయంలోనే ఆత్మాహుతి చేసుకుంటానని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన భోజ్‌పూర్ జిల్లాలోని జగదీష్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో తన చేతిలో ఓడిపోయిన భగవాన్ సింగ్ కుష్వాహాను తన స్థానం నుంచి బరిలోకి దించాలని ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ భావిస్తున్నట్లు వినిపించడంతో ఆయన నిరసన ప్రారంభించారు. స్థానిక మీడియాలో కూడా తనకు టికెట్ ఇవ్వరంటూ కథనాలు వచ్చాయన్నారు. ఆర్జేడీ తన తొలి జాబితాను శనివారమే విడుదల చేస్తుందని అనుకుంటున్నారు. బిహార్‌లో అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5 వరకు మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 8వ తేదీన విడుదలవుతాయి. -
సమైక్యాంధ్ర కోసం విలేకరి ఆత్మహత్యాయత్నం
సమైక్యాంధ్ర కోసం ఓ పాత్రికేయుడు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో జరుగుతున్న ఆందోళనల సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన సాయి అనే పాత్రికేయుడు పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న పలువురు నాయకులు చూసి, అతడిని అడ్డుకుని ఆత్మహత్యాయత్నాన్ని నిరోధించారు. గత కొన్ని రోజులుగా సీమాంధ్ర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సమైక్యాంధ్ర కోసం తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కాకినాడలో బుధవారం ఉదయం మెయిన్ రోడ్డులో ధర్నా చేశారు. ఆ తర్వాత కొంతసేపు మానవ హారం నిర్వహించారు. మసీదు సెంటర్లో కూడా ధర్నా చేయాలని ఆందోళనకారులు తలపెట్టారు. అంతా కలిసి మసీదు సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ ధర్నా ప్రారంభమైన కొద్దిసేపటికే స్థానిక దినపత్రికకు చెందిన విలేకరి సాయి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తన వాహనంలో ఉన్న పెట్రోలును తీసుకుని, ఒంటిపై పోసుకున్నాడు. నిప్పు అంటించుకోబోతుండగా అక్కడే ఉన్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వేణు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గమనించి అతడిని పట్టుకుని నిప్పు అంటించుకోకుండా ఆపారు. రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేస్తామంటున్నారని, అది చూసి తట్టుకోలేకపోయానని ఆ తర్వాత సాయి చెప్పాడు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కాకిలేరులో రాష్ట్ర విభజనను తట్టుకోలేక రాజీవ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగిన కొద్ది సేపటికే పొరుగునున్న తూర్పుగోదావరి జిల్లాలో విలేకరి ఆత్మహత్యాయత్నం జరగడం గమనార్హం.