పట్నా : రాహుల్ గాంధీ తన రాజీనామాను వెనక్కి తీసుకోకపోతే మూకుమ్ముడి ఆత్మహత్యలకు పాల్పడతామంటున్నారు బిహార్ కాంగ్రెస్ కార్యకర్తలు. వివరాలు.. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాహుల్ బిహార్ వెళ్లారు. గతంలో రాహుల్‌పై బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ పరువునష్టం కేసు వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్ పట్నా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. దీనిపై విచారణ జరిపిన పట్నా కోర్టు శనివారం ఆయనకు రూ.10 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
అయితే రాహుల్ రాక గురించి తెలిసిన కార్యకర్తలు రాజీనామాను ఉపసంహరించుకునేలా ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు పట్నాలో పోస్టర్లు ఏర్పాటు చేశారు. రాహుల్ రాజీనామాను ఉపసంహరించుకోకపోతే జులై 11న 12 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా ఆత్మహత్యలకు పాల్పడతామని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment