
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మద్దిరాల (సూర్యాపేట) : ప్రేమ విఫలమై ఓ యువతి బలవన్మరణానికి పాల్పడడంతో మండల పరిధిలోని ముకుందాపురంలో విషాదం అలుముకుంది. స్థానికులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ముకుందాపురం గ్రామానికి చెందిన గాడ్దుల రామచంద్రు, లక్ష్మమ్మ దంపతుల నాలుగో కుమార్తె ఉమ(22) హైదరాబాద్‌లో బీ ఫార్మసీ చదువుతోంది. లాక్‌డౌన్ కావడంతో స్వగ్రామం వచ్చింది. నాలుగేళ్లుగా అదే గ్రామానికి చెందిన నర్సింగ్ ఉమేష్, ఉమ ప్రేమించుకుంటున్నారు.
కాగా, ఉమేష్‌కు మరో యువతితో కుటుంబ సభ్యులు వివాహం నిశ్చయించారని తెలుసుకుని మనస్తాపానికి గురైంది. దీంతో సోమవారం హైదరాబాద్‌కు వెళ్లింది. గదిలో ఒంటరిగా ఉంటున్న ఉమ ప్రేమ విఫలమైందన్న దిగులుతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున యువతి తలుపు తీయకపోవడంతో ఇంటి యజమాని చూసి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందజేసినట్లు తెలిపారు.
చదవండి: బుల్లెట్ కోసం టెక్కీ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment