
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: చెన్నై డీజీపీ కార్యాలయం ఎదుట బుల్లితెర నటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. పరమేశ్వరి అలియాస్ భైరవి బుల్లితెర నటిగా ఉన్నారు. ఈమె ఈ నెల 25న పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. అందులో వేలూరుకు చెందిన రాజాదేసింగ్ అలియాస్ సుబ్రమణి తనకు సినీ నిర్మాతగా పరిచయమయ్యాడని, ఆ తరువాత షూటింగ్‌లో భాగంగా మయిలాడు దురైకు తీసుకెళ్లి గుడిలో తనను పెళ్లి చేసుకున్నాడని పేర్కొన్నారు.
ఈ క్రమంలో తనను వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించారు. నిందితుడిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ భైరవి సోమవారం చెన్నై డీజీపీ కార్యాలయానికి వెళ్లి తలపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమీపంలోని పోలీసులు ఆమెను కాపాడారు.
Comments
Please login to add a commentAdd a comment