హిందూపురం అర్బన్ : పట్టణంలోని ఇందిరానగర్‌లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో పని చేస్తున్న మల్లేశ్వరీ(46) అనే అంగన్‌వాడీ కార్యకర్త జేఈ వైరస్ సోకి గురువారం కర్ణాటక తుమకూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆమెకు ముగ్గురు సంతానం. పెద్దకుమార్తెకు ఇటీవల వివాహమైంది. 20 రోజుల క్రితం వాంతులు అధికం కావడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని స్థానిక వైద్యులు సూచించారు. దీంతో అటు నుంచి తుమకూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలో ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందింది.