పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రామసింగవరంలో దారుణం చోటు చేసుకుంది. రంగాపురం హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్న మల్లీశ్వరి తరచు స్కూల్కు వెళ్లనని మారాం చేస్తుంది. దీంతో విసిగిపోయిన తండ్రి రాజారత్నం ఆమె తీవ్రంగా కొట్టాడు. దాంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. కంగారు పడిన ఆమె తల్లిదండ్రులు వెంటనే ఆమెను గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. ఆమె కోమాలోకి వెళ్లిందని... చెప్పడంతో ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మల్లీశ్వరి అక్కడ చికిత్స పొందుతూ మరణించింది.