
భాంగ్రా బీట్ కు కెనడా ప్రధాని స్టెప్పులు..!
ప్రజల మనిషిగా పేరొంది... కెనడా దేశానికి కొత్తగా ఎన్నికైన ప్రధాని జస్టిన్ ట్రూడో భాంగ్రా డ్యాన్సుతో వీక్షకుల మనసు దోచుకున్నారు. ప్రధాని హోదాలోనూ ఆయన సాధారణ వ్యక్తిగా కలసిపోయారు. సంప్రదాయ కుర్తా పైజమా ధరించి, డ్చాన్స్ ఫ్లోర్ పై నృత్యకారిణులతో పదం కలిపారు. పంజాబీ జానపద నృత్యంగా పేరొందిన భాంగ్రా డ్యాన్స్ కు లయబద్ధంగా స్టెప్పులు వేసి అందర్నీ, విస్మయానికి, ఆశ్చర్యానికి గురిచేశారు.
ఇండియన్ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మాంట్రియల్ ఈవెంట్ లో 43 ఏళ్ల గ్రూవింగ్ ఓ పంజాబీ పాటకు చేసిన డ్యాన్స్.. యూట్యూబ్ లో విడుదలైంది. వేదికపై జరుగుతున్న నృత్య కార్యక్రమంలో భాగంగా ఓ మహిళతో కలసి ట్రూడో.. పాటకు అనుగుణంగా పదాలు కలుపుతూ తానూ ఓ ఏస్ డ్యాన్సర్ అని నిరూపించుకున్నారు. ట్రూడో చూపించిన ఉత్సాహానికి అక్కడివారంతా ముగ్ధులయ్యారు. వారంతా ఒక్కొక్కరుగా వేదికపైకి వచ్చి ఆయనతో పాటు డ్యాన్స్ లో పాలుపంచుకున్నారు.
అక్టోబర్ 19న ఓ కొత్త అధ్యాయానికి తెరలేపి.. 43 ఏళ్ల వయసులోనే ప్రధాని అయిన రెండో వ్యక్తి ట్రూడో. ఈ సందర్భంగా ఆయన తనకు మద్దతు ఇచ్చినవారికి వారికి కృతజ్ఞతలు తెలిపారు.అదేరోజు మాట్రియల్లో జర్రీ సబ్వే స్టేషన్ సందర్శించిన ఆయన అక్కడికి వచ్చిన వారందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి.. వారితో కలసి ఉత్సాహంగా తీసుకున్న సెల్ఫీలను ఓ వెబ్ సైట్ పోస్ట్ చేసింది. 1968 నుంచి 1979 వరకు, తిరిగి 1980 నుంచి 1984 వరకు కెనడా ప్రధానిగా ఉన్న.. కెనడా మాజీ ప్రధాని పియర్ ట్రుడో కుమారుడే.. ఈ ప్రజా వ్యక్తి జస్టిన్ ట్రుడో.