Auto Driver Attacked on Womens at Rajendranagar - Sakshi
Sakshi News home page

Rajendranagar: ఆటోడ్రైవర్‌ వీరంగం.. మహిళ డ్రెస్‌ పట్టుకొని..

Published Sat, Apr 16 2022 7:33 PM | Last Updated on Sun, Apr 17 2022 8:14 AM

Auto Driver Attacked On Womens At Rajendranagar - Sakshi

Rajendranagar: టో ట్రాలీని నెమ్మదిగా వెళ్లమని సూచించినందుకు డ్రైవర్‌ ఇద్దరు మహిళలతో పాటు మరో యువకుడిపై దాడికి దిగాడు. ఈ ఘటనను స్థానికులు తమ సెల్‌ఫోన్‌లలో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో  శనివారం ఈ విషయం బయటకు వచ్చింది. హైదర్‌గూడకు చెందిన చందు తన ద్విచక్ర వాహనంపై కుటుంబ సభ్యులతో ఈశ్వర్‌ థియేటర్‌ లైన్‌ రోడ్డులో శుక్రవారం సాయంత్రం వెళ్తున్నాడు.

ఇదే సమయంలో ఓ ఆటో ట్రాలీలో వస్తూ వారి పక్క నుంచి కట్‌ కొట్టాడు. దీంతో వాహనంపై ఉన్న మహిళలు నెమ్మదిగా వెళ్లమని తెలపడంతో ఆటో డ్రైవర్‌ వాగ్వాదానికి దిగి మొదట చందుపై దాడి చేశాడు. అనంతరం అడ్డుకునేందుకు యత్నించిన మహిళలపై సైతం దాడి చేశాడు. ఈ ఘటనను స్థానికులు తమ సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించారు. ఈ వీడియోలు శనివారం వైరల్‌ కావడంతో రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement