
‘నిజాంను పొగిడితే జనం కొడతారు’
పరకాల: 'నిజాం ఆదర్శ పాలనపై చర్చించేందుకు మేం రెడీ.. నిజాం గుణగణాలపై పరకాల చౌరస్తాలో మాట్లాడుకుందాం.. చరిత్రను వక్రీకరించి నిజాంను పొడిగితే జనం కొడతారు..' అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు అన్నారు.
వరంగల్ జిల్లా పరకాలలో బుధవారం అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని అమరవీరులకు నివాళులు అర్పించారు. నిజాం లాగే మళ్లీ జమీందారీ వ్యవస్థకు ప్రాణం పోసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశం కోసమే పుట్టిన పార్టీగా చెప్పుకున్న కాంగ్రెస్, తెలంగాణ ఉద్యమం కోసం స్థాపించిన టీఆర్‌ఎస్ పార్టీకి తేడా ఏమాత్రం లేదన్నారు. రెండు పార్టీలు ఇప్పుడు కుటుంబ పార్టీలుగా, జేబు పార్టీలుగా మారిపోయాయన్నారు.