సైకిల్‌పై బీట్ కానిస్టేబుళ్ల గస్తీ
Published Wed, Feb 1 2017 1:01 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
కర్నూలు : గస్తీ పోలీసులు ఇకనుంచి సైకిళ్లపై పర్యటించే విధంగా ఎస్పీ ఆకే రవికృష్ణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు గస్తీ పోలీసులు మోటర్‌సైకిళ్లపై కాలనీల్లో పర్యటించేవారు. అయితే ఇకపై ఈ–గస్తీలో భాగంగా సైకిళ్లపై బీట్లు తిరగడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో స్థానిక పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీసుల ఆరోగ్యం కోసం పార్కులు, జిమ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీసు కుటుంబాల మహిళలకు అధునాతన జనపనార బ్యాగ్ చేతికుట్టు పనులు, పోలీస్ గెస్ట్‌హౌస్‌లో టీవీలు తదితర వాటి ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, ఓఎస్‌డీ రవిప్రకాష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, కృష్ణమోహన్, సీఐ డేగల ప్రభాకర్, ఏఓ అబ్దుల్ సలాం, ఆర్‌ఐ రంగముని, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement