
మహిళపై దాడి చేస్తున్న టీడీపీ నాయకులు
సాక్షి, కళ్యాణదుర్గం: కుందుర్పి మండల కేంద్రంలో ఓ మహిళపై టీడీపీ నాయకులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి ...కుందుర్పికి చెందిన జలజమ్మకు మండల కేంద్రంలోని ప్రభుత్వ స్థలంలో ఇంటి పట్టా ఇచ్చారు. సదరు స్థలంలో టీడీపీ మాజీ సర్పంచ్ పెద్ద నరసింహప్ప తమిళనాడుకు చెందిన మీనాక్షి అనే మహిళ నుంచి కొనుగోలు చేసి పట్టా పొందిన్నట్లు సృష్టించుకున్నాడు. టీడీపీ అధికారంలో ఉనప్పుడు సర్వేనంబర్ 222లో పెద్ద నరసింహప్ప కుటుంబ సభ్యులు పట్టా తీసుకున్నారు. పట్టా పొందిన జలజమ్మ శనివారం పునాదులు వేసేందుకు సిద్దం కాగా మాజీ సర్పంచ్ నరసింహప్ప, ఆయన కుమారుడు శ్రీనివాసులు దౌర్జాన్యానికి దిగారు. మహిళ అని చూడకుండా చీర లాగి రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. సదరు మహిళ కుడిచేతికి, తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితురాలు కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. దౌర్జన్యపరులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతోంది. కుందుర్పి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment