టీచర్లను పబ్లిక్‌గా చితకబాదారు... | shiv sena workers beat two coaching institute teachers | Sakshi
Sakshi News home page

టీచర్లను పబ్లిక్‌గా చితకబాదారు...

Published Sat, Jul 1 2017 11:47 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

టీచర్లను పబ్లిక్‌గా చితకబాదారు... - Sakshi

టీచర్లను పబ్లిక్‌గా చితకబాదారు...

ఔరంగాబాద్‌ : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విచక్షణ కోల్పోయి, విద్యార్థినులను వేధింపులకు గురి చేయడంతో  స్థానిక  శివసేన కార్యకర్తలు వారికి దేహశుద్ది చేశారు. ఔరంగాబాద్‌లో ఇద్దరు ఉపాధ్యాయులను పబ్లిక్‌గా చితకబాది అనంతరం పోలీసులకు అప్పగించారు. స్థానిక ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌లో ఈ సంఘటన జరిగింది. అక్కడ చదువుకుంటున్న విద్యార్ధినులతో... ఫ్యాకల్టీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.

ఈ ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న శివసేన కార్యకర్తలు ఉపాధ్యాయుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఫ్యాకల్టీ తీరుకు ఇనిస్టిట్యూట్‌ మేనేజర్‌ వంతపాడటంతో ఆయన పైనా చేయిచేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లెక్చరర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement