సాక్షి, ముంబై: ఔరంగాబాద్ పేరు మారుస్తూ మహా రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ తప్పుబట్టారు. అందుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. ఔరంగాబాద్‌కో చరిత్ర ఉందని, దాన్నెవరూ చెరపలేరని అన్నారు. ఎంవీఏ నేతలు... ఛత్రపతి శంభాజీ మహరాజ్ పేరును తమ రాజకీయా ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పుడు బాల్ కేంద్ర ప్రభుత్వ కోర్టులో ఉందన్న ఇంతియాజ్, నిర్ణయానికి వ్యతిరేకంగా అవసరమైతే తాము వీధుల్లోకొస్తామని స్పష్టం చేశారు. పేరు మార్చడానికి ముందు ఔరంగాబాద్‌ను అభివృద్ధి చేస్తామని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారని, కానీ అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు.
కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఔరంగాబాద్ శివసేన, మహానవనిర్మాణ్ సేన, బీజే పీ నేతలు స్వాగతించారు. ఎలాంటి జాప్యం చేయకుండా కేంద్రం ఈ ప్రతిపాదనను ఆమో దించాలని ఎమ్మెల్సీ అంబదాస్ అన్నారు. ఔరంగాబాద్ పేరు మార్చడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. తన తండ్రి బాల్ ఠాక్రే హామీ ఉద్ధవ్ నెరవేర్చారని, ఇక ఆమో దం విషయంలో బీజేపీ ఎంత చిత్తశుద్ధి చూపుతుందో తెలుస్తుందని అన్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఈ నిర్ణయాన్ని ఇంకాస్త ముందు తీసుకు ని ఉంటే బాగుండేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అతుల్ అభిప్రాయపడ్డారు.
చదవండి: ఎమ్మెల్యేలను వదులుకున్నారు.. ఎన్‌సీపీని వదలలేరా?
Comments
Please login to add a commentAdd a comment