ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మే 6, మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే పేసర్ మతీష పతిరణ అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన పతిరణ.. తనకు మాత్రమే సాధ్యమైన స్వింగింగ్ యార్కర్లతో ముంబై బ్యాటర్లను బెంబేలెత్తించి, 3 వికెట్లు కీలక పడగొట్టాడు. అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన పతిరణ.. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై బ్యాటర్లను కట్టడి చేశాడు.
చదవండి: నేను బాగా ఆడినపుడే.. నాకు క్రెడిట్ దక్కకుండా చేస్తాడు: ఇషాన్ కిషన్ video
తన కోటా ఓవర్లలో పతిరణ ఒక్కటంటే ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం. ఈ మ్యాచ్‌లో స్పెల్‌తో పతిరణ మరోసారి తాను మలింగకు అసలుసిసలు వారసుడని నిరూపించుకున్నాడు. పతిరణతో పాటు దీపక్ చాహర్ (3-0-18-2), తుషార్ దేశ్‌పాండే (4-0-26-2) విజృంభించడంతో ముంబై ఇండియన్స్ కేవలం 139 పరుగులకే పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్‌లో నేహల్ వధేరా (64) ఒక్కడే రాణించాడు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్‌కేకు ఓపెనర్లు డెవాన్ కాన్వే (25 నాటౌట్), రుతురాజ్ (30) మెరుపు ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడుతున్న రుతురాజ్ ఐదో ఓవర్ తొలి బంతికి పియూష్ చావ్లా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం క్రీజ్‌లో వచ్చిన రహానే (21) సైతం ముంబై బౌలర్లపై ఎదురుదాడి చేస్తున్నాడు. దీంతో సీఎస్‌కే 8.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment