స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరన అదగొట్టాడు. దంబుల్లా వేదికగా జరిగిన ఆఖరి టీ20లో కూడా రెండు వికెట్లతో సత్తాచాటాడు. ఓవరాల్‌గా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పతిరన 8 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
ఒక టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన లంక బౌలర్‌గా మతీషా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో తన ఆరాధ్య బౌలర్, శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ రికార్డును పతిరన బ్రేక్ చేశాడు. 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో మలింగ 7 వికెట్లు తీశాడు. అయితే.. అదే ఏడాది మరో శ్రీలంక పేసర్ తుషారా పాకిస్తాన్‌పై 7 వికెట్లు పడగొట్టి ఆ రికార్డును సమం చేశాడు.
ఆ తర్వాత 2022లో దుష్మంత చమీర కూడా ఆస్ట్రేలియాపై 7 వికెట్లు పడగొట్టి మలింగతో పాటు సంయుక్తంగా నిలిచాడు. కానీ వీరివ్వరూ కూడా మలింగను అధిగమించలేకపోయారు. తాజా మ్యాచ్‌తో 5 ఏళ్ల మలింగ ఆల్‌టైమ్ రికార్డును పతిరన బ్రేక్ చేశాడు. కాగా పతిరన ఐపీఎల్‌లో ధోని సారథ్యంలోని సీఎస్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అందరూ అతడిని ధోని శిష్యుడంటూ పిలుస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment