
PC: IPL.com
ఐపీఎల్-2023లో మిగిలిన మ్యాచ్‌లకు గాను ముంబై ఇండియన్స్ ఇంగ్లండ్ స్టార్ పేసర్ క్రిస్ జోర్డాన్‌తో ఒప్పందం కుదర్చుకుంది. అయితే ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఇంకా అధికారికంగాప్రకటించలేదు. కానీ జోర్డాన్ మాత్రం ముంబై ట్రైనింగ్ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తుండడం కన్పించింది.
అయితే అతడిని ఎవరు స్థానంలో భర్తీ చేశారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, జై రిచర్డ్‌సన్‌లు గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరం కావడంతో.. ముంబై ఇండియన్స్ బౌలింగ్ పరంగా పేలవ ప్రదర్శన కనబరుస్తుంది.
ఇప్పుడు జట్టులో జోర్డాన్ చేరడం వాళ్లకు బలం చేకూరుతుంది. ఇక ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆశించినంత మేర రాణించలేకపోతుంది. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించింది. ఇక ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో ఆదివారం వాంఖడే వేదికగా తలపడనుంది. కాగా ఐపీఎల్ చరిత్రలో ఇది 1000వ మ్యాచ్ కావడం విశేషం.
చదవండి: #HBD Rohit Sharma: రోహిత్‌కు హైదరాబాద్ ఫ్యాన్స్ బర్త్‌డే గిఫ్ట్.. 60 అడుగుల భారీ కటౌట్
Comments
Please login to add a commentAdd a comment