England Announced 15 Member Squad For T20 World Cup 2022, Check Names Here - Sakshi
Sakshi News home page

T20 WC 2022- England Squad: ప్రపంచకప్‌ టోర్నీకి జట్టును ప్రకటించిన ఇంగ్లండ్‌.. అతడికి మొండిచేయి!

Published Fri, Sep 2 2022 4:08 PM | Last Updated on Fri, Sep 2 2022 4:58 PM

T20 World Cup 2022: England Announces 15 Member Squad Jason Roy Dropped - Sakshi

ప్రపంచకప్‌ టోర్నీకి జట్టుకు ప్రకటించిన ఇంగ్లండ్‌..(PC: England Cricket Twitter)

T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీకి ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఐసీసీ మెగా టోర్నీలో భాగం కానున్న 15 మంది ఆటగాళ్ల పేర్లను శుక్రవారం వెల్లడించింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌కు చాలా రోజుల తర్వాత పరిమిత ఓవర్ల జట్టుకు పిలుపు రాగా.. జేసన్‌ రాయ్‌కు మొండిచేయి ఎదురైంది. కాగా రాయ్‌ ఈ ఏడాది ఇంగ్లండ్‌ తరఫున ఆడిన 11 టీ20 మ్యాచ్‌లలో మొత్తంగా 206 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 

ఆరోజే తొలి మ్యాచ్‌
ఇదిలా ఉంటే.. గాయాల నుంచి కోలుకున్న పేస్‌ ద్వయం క్రిస్‌ వోక్స్‌, మార్క్‌ వుడ్‌ కూడా తిరిగి జట్టులోకి వచ్చారు. క్రిస్‌ జోర్డాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌ సైతం ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక జోస్‌ బట్లర్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ జట్టు అక్టోబరు 22న అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌తో మెగా ఈవెంట్‌ ప్రయాణాన్ని ఆరంభించనుంది. కాగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ జరుగనుంది.

టీ20 ప్రపంచకప్‌-2022: ఇంగ్లండ్‌ బోర్డు ప్రకటించిన జట్టు ఇదే!
జోస్‌ బట్లర్‌(కెప్టెన్‌), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్‌, సామ్‌ కరన్‌, క్రిస్‌ జోర్డాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, డేవిడ్‌ మలాన్‌, ఆదిల్‌ రషీద్‌, ఫిల్‌ సాల్ట్‌, బెన్‌ స్టోక్స్‌, రీస్‌ టోప్లే, డేవిడ్‌ విల్లే, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌ వుడ్‌.

చదవండి: IPL Auction: షాహిన్‌ ఆఫ్రిది ఐపీఎల్‌ వేలంలోకి వస్తే 14- 15 కోట్లకు అమ్ముడుపోయేవాడు: అశ్విన్‌
Asia Cup 2022 Pak Vs HK: గత రికార్డులు ఘనమే! కానీ ఇప్పుడు హాంగ్‌ కాంగ్‌ను పాక్‌ లైట్‌ తీసుకుంటే అంతే సంగతులు!
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. పవర్‌ హిట్టర్‌ ఎంట్రీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement