BBL 2023: రాణించిన క్రిస్‌ జోర్డన్‌, బెన్‌ మెక్‌డెర్మాట్‌ | BBL 2023: Hobart Hurricanes Beat Sydney Thunder By 7 Wickets | Sakshi
Sakshi News home page

BBL 2023: రాణించిన క్రిస్‌ జోర్డన్‌, బెన్‌ మెక్‌డెర్మాట్‌

Published Mon, Jan 1 2024 9:25 PM | Last Updated on Tue, Jan 2 2024 9:43 AM

BBL 2023: Hobart Hurricanes Beat Sydney Thunder By 7 Wickets - Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌ 2023లో భాగంగా ఇవాళ (జనవరి 1) జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్‌ హరికేన్స్‌, సిడ్నీ థండర్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్‌పై హరికేన్స్‌ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన థండర్‌.. క్రిస్‌ గ్రీన్‌ (33 నాటౌట్‌), డేనియల్‌ సామ్స్‌ (25), బాన్‌క్రాఫ్ట్‌ (21), ఒలివర్‌ డేవిస్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. హరికేన్స్‌ బౌలర్లు క్రిస్‌ జోర్డన్‌ (2/20), నిఖిల్‌ చౌదరీ (2/26), పాట్రిక్‌ డూలీ (2/33), నాథన్‌ ఇల్లిస్‌ (1/39) థండర్‌ పతనాన్ని శాశించారు. 

అనంతరం ఛేదనకు దిగిన హరికేన్స్‌.. బెన్‌ మెక్‌డెర్మాట్‌ (53 నాటౌట్‌) అర్ధసెంచరీతో సత్తా చాటడంతో 18.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. కాలెబ్‌ జువెల్‌ (31), రైట్‌ (34) రాణించగా.. ఆఖర్లో ఆండర్సన్‌ (12 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. థండర్‌ బౌలర్లలో డేనియల్‌ సామ్స్‌, తన్వీర్‌ సంగా, నాథన్‌ మెక్‌అండ్రూ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో హరికేన్స్‌ రన్‌రేట్‌ను కాస్త మెరుగుపర్చుకుని ప్లేఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడిన థండర్‌ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement