
Courtesy: IPL Twitter
సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ రషీద్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. క్రిస్ జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ 18 వ ఓవర్‌లో రషీద్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. 18 బంతుల్లో 48 పరుగులు చేయాల్సిన దశలో రషీద్ ఖాన్ జోర్డాన్ వేసిన ఓవర్లో తొలి నాలుగు బంతులను 6,6,4,6గా మలిచి 22 పరుగులు పిండుకున్నాడు. ఓవరాల్‌గా ఆ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి.
ఆ తర్వాత బ్రావో వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మరో బౌండరీ బాదిన రషీద్ ఖాన్.. అదే ఓవర్ ఐదో బంతికి మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అలా 21 బంతుల్లో 40 పరుగుల రషీద్ విధ్వంసానికి తెరపడింది. కాగా సీఎస్‌కేతో మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరంగా ఉండడంతో.. రషీద్ ఖాన్ స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.