IPL 2022 Final RR Vs GT: Rashid Khan Wants To Play Snake Shot In Final - Sakshi
Sakshi News home page

IPL 2022 Final RR Vs GT: 'ఐపీఎల్‌ ఫైనల్లో ఖచ్చితంగా స్నేక్‌ షాట్‌ ఆడుతాను'

Published Sat, May 28 2022 6:07 PM | Last Updated on Sat, May 28 2022 9:37 PM

Rashid Khan wants to play snake shot in IPL 2022 final - Sakshi

PC: IPL.COM

ఐపీఎల్‌-2022లో గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ స్సిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ బాల్‌తోనే కాకుండా బ్యాట్‌తో కూడా అదరగొడుతున్నాడు. అదే విధంగా క్రికెట్‌లో ఓ కొత్త షాట్‌ను రషీద్‌ ఆవిష్కరించాడు.  ఆ షాట్‌కు స్నేక్‌ షాట్‌గా రషీద్‌ నామకరణం కూడా చేశాడు. ఇక అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం(మే29) జరగున్న ఫైనల్లో రాజస్తాన్‌ రాయల్స్‌తో గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనుంది. క్వాలిఫయర్‌ 1లో రాజస్తాన్‌పై విజయం సాధించిన గుజరాత్‌.. ఫైనల్లో కూడా ఆదే జోరును కొనసాగించి టైటిల్‌ నెగ్గాలని భావిస్తోంది. ఇక ఫైనల్లో కూడా బ్యాటింగ్‌ చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా స్నేక్‌ షాట్‌ ఆడుతానని రషీద్‌ ఖాన్‌ తెలిపాడు.

"నేను ప్రాక్టీస్ సెషన్‌లో ఎక్కువగా బ్యాటింగ్ చేస్తున్నాను. కాగా గతంలో కంటే నాకు ఇప్పుడు ఎక్కువగా బ్యాటింగ్‌ చేసే అవకాశం లభిస్తుంది. కాబట్టి  జట్టుకు అఖరిలో కొన్ని పరుగులు అందించగలనే నమ్మకం ప్రతి ఒక్కరూ నాపై పెట్టుకున్నారు. అదే విధంగా జట్టుకు అవసరమైనప్పడు 20 నుంచి 25 పరుగులు చేయగలననే నమ్మకం నాకు ఎప్పుడూ ఉంటుంది. ఇక ఫైనల్లో బ్యాటింగ్‌ చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా స్నేక్‌ షాట్‌ ఆడుతాను" అని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రషీద్‌ ఖాన్‌ పేర్కొన్నాడు.

చదవండి: RCB Tweet On RR: రాజస్తాన్‌కు ఆర్సీబీ విషెస్‌.. గుండెల్ని మెలిపెట్టే ట్వీట్‌! హృదయాలు గెలిచారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement