PC: IPL. COM
టీమిండియా యవ బౌలర్, లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌పై గుజరాత్ టైటాన్స్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. రాబోయే రోజుల్లో బిష్ణోయ్ భారత్‌కు స్టార్ స్సిన్నర్‌గా మారుతాడని రషీద్ ఖాన్ కొనియాడాడు. ఇక ఐపీఎల్-2022లో 14 మ్యాచ్‌లు ఆడిన బిష్ణోయ్ 13 వికెట్లు పడగొట్టాడు. "బిష్ణోయ్ మంచి ప్రతిభావంతుడు. అతడితో నేను చాలా సార్లు మాట్లాడాను. అతడు రాబోయే రోజుల్లో టీమిండియాకు స్టార్ బౌలర్ అవుతాడు.
బిష్ణోయ్ తన స్కిల్స్‌ను మరింత మెరుగుపరచుకుని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను" అని రషీద్ పేర్కొన్నాడు. ఇక యజువేంద్ర చాహల్ గురించి మాట్లాడూతూ.. "చాహల్ ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్. భారత్, ఆర్సీబీ తరపున చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
అతడు తన బౌలింగ్‌లో అద్భుతమైన స్కిల్స్‌ను ప్రదర్శిస్తాడని" రషీద్ తెలిపాడు. ఇక ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న రషీద్ ఆల్‌రౌండర్ స్కిల్స్‌తో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన 18 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IPL 2022: ఫైనల్‌కు 6000 మంది పోలీసులతో భారీ భద్రత.. కారణం అదేనా?
Comments
Please login to add a commentAdd a comment