ఇంగ్లండ్‌ వెన్ను విరిచిన మోటీ.. సిరీస్‌ విండీస్‌దే..! | WI VS ENG 5th T20: West Indies Beat England By 4 Wickets In Series Decider, Clinches Series | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ వెన్ను విరిచిన మోటీ.. సిరీస్‌ విండీస్‌దే..!

Published Fri, Dec 22 2023 7:27 AM | Last Updated on Fri, Dec 22 2023 7:27 AM

WI VS ENG 5th T20: West Indies Beat England By 4 Wickets In Series Decider, Clinches Series - Sakshi

ట్రినిడాడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో వెస్టిండీస్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొంది, 3-2 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. గుడకేశ్‌ మోటీ (4-0-24-3), ఆండ్రీ రసెల్‌ (4-0-25-2), అకీల్‌ హొసేన్‌ (4-0-20-2),హోల్డర్‌ (3.3-0-24-2) ధాటికి 19.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఫిలిప్‌ సాల్ట్‌ (38) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. లివింగ్‌స్టోన్‌ (28), మొయిన్‌ అలీ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. జాన్సన్‌ ఛార్లెస్‌ (27), షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (30) సాయంతో షాయ్‌ హోప్‌ (43 నాటౌట్‌) విండీస్‌ను గెలిపించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రీస్‌ టాప్లే, ఆదిల్‌ రషీద్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. క్రిస్‌ వోక్స్‌, సామ్‌ కర్రన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

3 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ వెనువిరిచిన మోటీకి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించగా.. సిరీస్‌ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన (వరుసగా రెండు సెంచరీలు) ఫిలిప్‌ సాల్ట్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కింది. కాగా, 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం కరీబియన్‌ దీవుల్లో పర్యటించిన ఇంగ్లండ్‌.. వరుసగా రెండు సిరీస్‌లను కోల్పోయింది. వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన ఇంగ్లండ్‌.. టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించినప్పటికీ సిరీస్‌ను చేజార్చుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement