ఫైనల్లో అడుగుపెట్టిన ప్రిటోరియా క్యాపిటల్స్ (PC: Jiocinema Twitter)
SA20, 2023 - Pretoria Capitals vs Paarl Royals: సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభ సీజన్‌లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా ప్రిటోరియా క్యాపిటల్స్ రికార్డులకెక్కింది. జోహన్నస్‌బర్గ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో పర్ల్ రాయల్స్‌ను ఓడించి ఈ ఘనత సాధించింది. రాయల్స్ జట్టును 29 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
అదరగొట్టిన రొసో
ది వాండరర్స్ వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ప్రిటోరియా- పర్ల్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన పర్ల్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రిటోరియాకు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(22) శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ కుశాల్ మెండిస్(7) విఫలమయ్యాడు.
కెప్టెన్ థియూనిస్ డి బ్రూయిన్ కూడా 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇలా జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిలీ రొసో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో ఈథన్ బోష్(22) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు.
ఫైనల్‌కు ప్రిటోరియా
ఇక లక్ష్య ఛేదనకు దిగిన పర్ల్ రాయల్స్‌ను ప్రిటోరియా బౌలర్లు ఆరంభం నుంచే ఇబ్బంది పెట్టారు. ఓపెనర్ జేసన్ రాయ్‌ను బోష్ డకౌట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. మిగతా బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో 19 ఓవర్లకే పర్ల్ రాయల్స్ కథ ముగిసింది. 124 పరుగులకు ఆలౌట్ అయి.. ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రిటోరియా విజయంలో కీలక పాత్ర పోషించిన రిలీ రొసో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
మరో సెమీస్ పోరులో..
కాగా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీకి చెందినదే ప్రిటోరియా క్యాపిటల్స్. ఇదిలా ఉంటే.. గురువారం నాటి రెండో సెమీ ఫైనల్లో జోబర్గ్ సూపర్ కింగ్స్- సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్లో ప్రిటోరియాను ఢీకొట్టనుంది.
చదవండి: Suryakumar Yadav: కల ఫలించింది.. టెస్టుల్లో అరంగేట్రం.. సూర్య, భరత్ ఉద్విగ్న క్షణాలు
Zim Vs WI 1st Test: జింబాబ్వే- వెస్టిండీస్‌టెస్టు ‘డ్రా’.. విండీస్ ఓపెనర్ల అరుదైన ఘనత
Rilee roared and ROARED LOUD 🐯💙
— JioCinema (@JioCinema) February 9, 2023
Watch @Rileerr’s 🔝 knock that powered @PretoriaCapsSA to the #SA20League final 🔥#PCvPR #SA20 #SA20onJioCinema #SA20onSports18 pic.twitter.com/TLemf48dLW
Comments
Please login to add a commentAdd a comment