సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో ప్రిటోరియా క్యాపిటల్స్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ ఏడాది సీజన్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ నాలుగో ఓటమి చవిచూసింది. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాపిటల్స్ ఘోర ప్రదర్శన కనబరిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ పేసర్లు నిప్పులు చేరగడంతో ప్రిటోరియా 13.3 ఓవర్లలో కేవలం 52 పరుగులకే కుప్పకూలింది. క్యాపిటల్స్ బ్యాటర్లలో ఓపెనర్లు విల్ జాక్స్(12), సాల్ట్(10) మినహా మిగితా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
సన్‌రైజర్స్ బౌలర్లలో ఒట్నీల్ బార్ట్‌మాన్ 4 వికెట్లతో క్యాపిటల్స్ పతనాన్ని శాసించగా.. వారెల్ మూడు, మార్కో జానెసన్ రెండు వికెట్లు సాధించారు. అయితే జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్రిటోరియా 52 పరుగులకే ఆలౌట్ కావడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
క్యాపిటల్స్ జట్టులో ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, రూసో, నీషమ్ వంటి డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు. కాగా 52 పరుగులకే ఆలౌటైన ప్రిటోరియా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా ప్రిటోరియా నిలిచింది.
6.5 ఓవర్లలోనే..
53 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 6. 5 ఓవర్లలోనే కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. దీంతో సన్‌రైజర్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని ప్రిటోరియా చవిచూసింది.
చదవండి: IND vs ENG: వారిద్దరూ కాదు.. కోహ్లి స్ధానంలో ఎవరూ ఊహించని ఆటగాడు!
Comments
Please login to add a commentAdd a comment