సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్(Sunrisers Eastern Cape) అడుగుపెట్టింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో పార్ల్ రాయల్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన సన్‌రైజర్స్.. వరుసగా మూడో సారి తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
పార్ల్ బ్యాటర్లలో రూబిన్ హెర్మాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 53 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెర్మాన్.. 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్ లువాన్-డ్రే ప్రిటోరియస్(59) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఓవర్టన్, మార్కో జానెసన్, బార్టమన్, మార్‌క్రమ్ తలా వికెట్ సాధించారు.
టోనీ ఊచకోత..
అనంతరం 176 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. లక్ష్య చేధనలో ఈస్ట్రన్ కేప్ ఓపెనర్ టోనీ డి జోర్జి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాయల్స్ బౌలర్లను టోనీ ఊచకోత కోశాడు. కేవలం 49 బంతుల్లోనే 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 78 పరుగులు చేసి ఔటయ్యాడు.
అతడితో పాటు జోర్డాన్ హెర్మాన్ సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రాయల్స్ బౌలర్లలో మఫాక, దునిత్ వెల్లలాగే తలా వికెట్ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
ఎంఐ కేప్‌టౌన్‌తో ఢీ..
ఇక శనివారం(ఫిబ్రవరి 8)న జోహాన్స్‌బర్గ్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో సన్‌రైజర్స్, ఎంఐ కేప్‌టౌన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. కేప్‌టౌన్‌కు ఇదే తొలి ఫైనల్ కాగా.. సన్‌రైజర్స్‌కు మాత్రం ఇది ముచ్చటగా మూడో ఫైనల్. తొలి రెండు సీజన్లలోనూ మార్‌క్రమ్ సారథ్యంలోనే సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఛాంపియన్స్‌గా నిలిచింది. కాగా ఈస్ట్రన్ కేప్ జట్టు ఐపీఎల్ ప్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికే సంబంధించినదే కావడం గమనార్హం.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. తొలి భారత ప్లేయర్‌గా
Comments
Please login to add a commentAdd a comment