సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) నిన్న (జనవరి 11) రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌పై పార్ల్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్ మార్క్రమ్ 49 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
జోర్డన్ హెర్మన్ 10, జాక్ క్రాలే 27, టామ్ ఏబెల్ 20, మార్కో జన్సెన్ 4, ట్రిస్టన్ స్టబ్స్ 28 (నాటౌట్) పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో క్వేనా మపాకా, ముజీబ్ ఉర్ రెహ్మాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 18.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ లుహాన్ డ్రే ప్రిటోరియస్ (51 బంతుల్లో 97; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) రాయల్స్ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మరో ఓపెనర్ జో రూట్ 44 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 62 పరుగులు చేసి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. రూట్‌కు కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (17 నాటౌట్) సహకరించాడు. రాయల్స్ కోల్పోయిన ఏకైక వికెట్ మార్కో జన్సెన్‌కు దక్కింది.
డిఫెండింగ్ ఛాంపియన్‌ను చిత్తు చేసిన సూపర్ కింగ్స్
నిన్ననే జరిగిన రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌పై జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.
లోయర్ ఆర్డర్ బ్యాటర్లు జార్జ్ లిండే (48 నాటౌట్), డెలానో పాట్‌గెటర్ (44 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఎంఐ ఈ మాత్రమే స్కోరైనా చేయగలిగింది. కేప్‌టౌన్ 75 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోగా.. లిండే, పాట్‌గెటర్ తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. జోబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో తబ్రేజ్ షంషి, డేవిడ్ వీస్, సిపామ్లా, ఈవాన్ జోన్స్ తలో వికెట్ పడగొట్టారు.
141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్‌కింగ్స్‌కు వర్షం పలుమార్లు అడ్డుతగిలింది. 11.3 ఓవర్ల అనంతరం మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన సూపర్ కింగ్స్‌ను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి సూపర్ కింగ్స్ 3 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది.
సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే 9, డుప్లెసిస్ 30, లుస్ డు ప్లూయ్ 24 (నాటౌట్), జానీ బెయిర్‌స్టో 14 పరుగులు చేశారు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన డుప్లెసిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఎంఐ బౌలర్లలో రబాడకు రెండు, ట్రెంట్ బౌల్ట్‌కు ఓ వికెట్ దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment