![SA20 2024: Miller, Ngidi Shines, Paarl Royals Beat Pretoria Capitals By 10 Runs - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/15/Untitled-7_0.jpg.webp?itok=N4y0M_bp)
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా నిన్న (జనవరి 14) జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ ఆటగాళ్లు చెలరేగిపోయాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత రాయల్స్ బ్యాటర్లు డేవిడ్ మిల్లర్ (42 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), వాన్ బురెన్ (40 బంతుల్లో 72 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (23 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) విజృంభించగా.. ఆతర్వాత బౌలింగ్‌లో లుంగి ఎంగిడి (4-0-39-4) నిప్పులు చెరిగాడు. ఫలితంగా రాయల్స్ 10 పరుగుల తేడాతో క్యాపిటల్స్‌పై విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. మిల్లర్, బురెన్, బట్లర్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో జేసన్ రాయ్ (5), విహాన్ లుబ్బే (12) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. క్యాపిటల్స్ బౌలర్లలో డుపవిల్లోన్, జేమ్స్ నీషమ్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు.
ఛేదనలో క్యాపిటల్స్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చినప్పటికీ.. లుంగి ఎంగిడి (4/39) ధాటికి ఓడక తప్పలేదు. ఎంగిడి నిప్పులు చెరిగే బంతులతో వికెట్లు తీసి క్యాపిటల్స్ పతనాన్ని శాశించాడు. విల్ జాక్స్ (34 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రిలీ రొస్సో (45 బంతుల్లో 82; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), నీషమ్ (9 బంతుల్లో 20; 4 ఫోర్లు) క్యాపిటల్స్‌ను గెలిపించేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. క్యాపిటల్స్ హిట్టర్లు ఫిల్ సాల్ట్ (0), డి బ్రూయిన్ (4), కొలిన్ ఇన్‌గ్రామ్ (1) నిరాశపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment