DC Vs RR: ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్‌ ముందు భారీ టార్గెట్ | IPL 2024 DC Vs RR: Fraser-McGurk, Porel, Stubbs Fire Delhi Capitals To 221 | Sakshi
Sakshi News home page

IPL 2024 DC Vs RR: ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్‌ ముందు భారీ టార్గెట్

Published Tue, May 7 2024 9:40 PM | Last Updated on Wed, May 8 2024 9:41 AM

IPL 2024: Fraser-McGurk, Porel, Stubbs fire Delhi Capitals to 221

ఐపీఎల్‌-2024లో భాగంగా అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. 

ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు జెక్‌ ఫ్రెజర్‌ మెక్‌ గర్క్‌(20 బంతుల్లో 50), అభిషేర్‌ పోరెల్‌(65) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు ఆఖరిలో ట్రిస్టన్‌ స్టబ్స్‌ మెరుపులు మెరిపించాడు.

20 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్‌.. 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు చేశాడు. రాజస్తాన్‌ బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ మూడువికెట్లు పడగొట్టగా.. చాహల్‌, బౌల్ట్‌, సందీప్‌ శర్మ తలా వికెట్‌ సాధించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement