ఢిల్లీ పవర్ హిట్టర్ దెబ్బ (PC: DC)
ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచలనం జేక్ ఫ్రేజర్ మెగర్క్ సంచలన షాట్‌తో మెరిశాడు. అతడి పవర్ హిట్టింగ్ కారణంగా కొత్త స్టేడియంలో ఓ స్టాండ్ టాప్‌నకు సొట్ట పడింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి గాయం కారణంగా తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మెగర్క్‌తో భర్తీ చేసింది.
మెల్‌బోర్న్‌కు చెందిన 21 ఏళ్ల మెగర్క్ హార్డ్ హిట్టింగ్‌కు పెట్టింది పేరు. లెగ్ స్పిన్ బౌలర్ కూడా! ఏడాది జనవరిలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన అతడిని రూ. 50 లక్షలకు మెగర్క్‌ను ఢిల్లీ సొంతం చేసుకుంది.
ఇక శుక్రవారం సీఎస్‌కే- ఆర్సీబీ మ్యాచ్‌తో చెపాక్‌లో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభం కానుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం(మార్చి 23) తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఛండీగర్‌లోని మల్లన్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మల్లన్‌పూర్ మైదానంలో ప్రాక్టీసు మొదలుపెట్టింది. ఇక బ్యాట్‌తో బరిలోకి దిగిన మెగర్క్ అద్భుత షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో అతడు భారీ సిక్సర్ కొట్టగా మల్లన్‌పూర్ స్టేడియం స్టాండ్ పైభాగంలో సొట్టపడింది.
ఇందుకు సంబంధించిన దృశ్యాలను పంచుకుంటూ.. ‘‘ప్రియమైన మల్లన్‌పూర్ స్టేడియం.. క్షమించు.. హృదయపూర్వకంగా క్షమాపణలు’’ అంటూ జేక్ ఫ్రేజర్ మెగర్క్ పేరిట క్యాప్షన్ జతచేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా బిగ్‌బాష్ లీగ్‌లో మెరుపులు మెరిపించిన మెగర్క్.. ఢిల్లీ క్యాపిటల్స్ మిడిలార్డర్‌లో హ్యారీ బ్రూక్ లేని లోటును తీర్చేందుకు సిద్ధమయ్యాడు.
చదవండి: IPL 2024: రూ. 24.75 కోట్ల ఆటగాడు... ఎన్ని వికెట్లు తీస్తాడంటే?!
Comments
Please login to add a commentAdd a comment