LSG Vs DC: అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్? | Jake Fraser-McGurk Scores Fifty On Debut Against Lucknow Super Giants, Know About Him In Telugu - Sakshi
Sakshi News home page

IPL 2024 LSG Vs DC: అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్?

Published Fri, Apr 12 2024 11:32 PM | Last Updated on Sat, Apr 13 2024 10:48 AM

Jake Fraser-McGurk scores fifty on debut against Lucknow Super Giants - Sakshi

PC: IPL

ఆస్ట్రేలియా యువ సంచలనం, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తన ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌తో క్యాష్‌రిచ్‌ లీగ్‌లోకి అడుగుపెట్టిన మెక్‌గుర్క్.. తన ఆట తీరుతో అందరని ఆకట్టుకున్నాడు.

వార్నర్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మెక్‌గుర్క్ లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. జేక్ ఫ్రేజర్- తను ఎదుర్కొన్న రెండో బంతినే అద్భుతమైన సిక్స్‌గా మలిచాడు. క్రీజులో ఉన్నంత సేపు లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా లక్నో స్పిన్నర్‌ కృనాల్‌ పాండ్యాను ఓ ఆట ఆడేసుకున్నాడు.

13 ఓవర్‌ వేసిన పాండ్యా బౌలింగ్‌లో మెక్‌గుర్క్‌ హ్యాట్రిక్‌ సిక్స్‌లు బాదాడు. ఓవరాల్‌గా బంతులు ఎదుర్కొన్న ఈ యువ సంచలనం.. 2 ఫోర్లు ,5 సిక్స్‌లతో 55 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ నెటిజనక్లు తెగ వెతికేస్తున్నారు.

ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్?
22 ఏళ్ల మెక్‌గుర్క్ ఏప్రిల్‌ 11, 2002న ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జన్మించాడు. జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో విక్టోరియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2019లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి జేక్ అడుగుపెట్టాడు. అదే ఏడాది లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లోకి అదరగొట్టడంతో అతడికి బిగ్‌బాష్‌లో లీగ్‌ ఆడే అవకాశం వచ్చింది.

బిగ్‌బాష్‌ లీగ్‌-2020 సీజన్‌లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్ తరపున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 37 టీ20 మ్యాచ్‌లు ఆడిన మెక్‌గుర్క్ 645 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 550 పరుగులు, లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 525 పరుగులు మెక్‌గుర్క్ చేశాడు.

అయితే జేక్  గతేడాదిలో లిస్ట్‌-ఏ క్రికెట్‌లో వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా దేశీవాళీ వన్డే టోర్నీలో కేవలం 29 బంతుల్లోనే సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. తద్వారా లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా అతడు రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో ఈ ఏడాది వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో మెక్‌గుర్క్‌ ఆసీస్‌ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా అతడు ఆకట్టుకున్నాడు. 

ఈ క్రమంలో మెక్‌గుర్క్‌ ఐపీఎల్‌-2024 వేలంలో రూ. 50 లక్షల కనీస ధరతో తన పేరును నమోదు చేసుకున్నాడు. కానీ ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఇంగ్లండ్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ నుంచి తప్పుకోవడంతో మెక్‌గుర్క్‌కు క్యాష్‌రిచ్‌ లీగ్‌లో భాగమయ్యే అవకాశం దక్కింది. రూ. 50 లక్షల బేస్‌ ప్రైస్‌కు మెక్‌గార్క్‌ను ఢిల్లీ ‍క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది. బ్రూక్‌ స్ధానాన్ని ఈ యువ కెరటంతో ఢిల్లీ భర్తీ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement