ఐపీఎల్-2024లో ఆస్ట్రేలియా యువ సంచలనం, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన మెక్‌గర్క్ టోర్నీ ఆసాంతం అదరగొట్టాడు. ఈ ఏడాది సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన మెక్‌గర్క్.. 234.04 స్ట్రైక్ రేటుతో 330 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో అతడికి ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్‌నకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఆస్ట్రేలియా క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టులో మెక్‌గర్క్‌కు చోటు దక్కలేదు.
కనీసం రిజర్వ్ జాబితాలో కూడా జేక్ ఫ్రేజర్‌కు అవకాశం ఇవ్వలేదు. సెలక్టర్ల నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఆసీస్ సెలక్టర్లు ఇప్పుడు తమ మనసును మార్చుకున్నట్లు తెలుస్తోంది. జేక్ ఫ్రేజర్‌ను టీ20 వరల్డ్‌కప్‌నకు రిజర్వ్ ఆటగాడిగా ఎంపిక చేయాలని ఆసీస్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు ఆసీస్ మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్‌కు బ్యాకప్‌గా మెక్‌గర్క్‌ను ఎంపిక చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జాన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఆసీస్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న ఒమెన్‌తో తలపడనుంది.
టీ20 ప్రపంచ కప్‌నకు ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్. జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.
Comments
Please login to add a commentAdd a comment