జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవ‌లం 19 బంతుల్లోనే! వీడియో వైర‌ల్‌ | IPL 2024 DC Vs RR: Jake Fraser-Mcgurk Hits 19-ball Fifty, Week After T20 WC Snub | Sakshi
Sakshi News home page

DC vs RR: జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవ‌లం 19 బంతుల్లోనే! వీడియో వైర‌ల్‌

Published Tue, May 7 2024 8:28 PM | Last Updated on Wed, May 8 2024 9:34 AM

DC vs RR: Jake Fraser-McGurk hits 19-ball fifty

ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ యువ ఓపెన‌ర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ మ‌రోసారి విధ్వంసం సృష్టించాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మెక్‌గుర్క్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాజస్తాన్ బౌలర్లను జేక్   ఫ్రేజర్ చుక్కలు చూపించాడు.

ముఖ్యంగా రాజస్తాన్ పేసర్ అవేష్ ఖాన్‌ను అయితే మెక్‌గుర్క్ ఊచకోత కోశాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్‌లో మెక్‌గుర్క్ 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే మెక్‌గుర్క్ తన హాఫ్ సెంచరీని అందుకున్నాడు.

ఓవరాల్‌గా 20 బంతులు ఎదుర్కొన్న జేక్ ఫ్రేజర్ 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. అత‌డి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. ఇక ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 7 మ్యాచ్‌లు ఆడిన మెక్‌గుర్క్.. 44.14 స‌గ‌టుతో 309 ప‌రుగులు చేశాడు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement