టీ20 ప్రపంచకప్-2022లో ఆస్ట్రేలియా బ్యాకప్ కెప్టెన్‌గా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సిడ్నీ మార్నింగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ మెగా ఈవెంట్‌లో రెగ్యులర్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ గాయపడిన లేదా మరే ఇతర కారణాల వల్ల జట్టుకు దూరమైతే వేడ్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా వేడ్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌లో ఉన్నాడు.
ఇటీవల టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ వేడ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇక అంతకుముందు 2020లో సిడ్నీ వేదికగా భారత్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో ఆసీస్ జట్టు కెప్టెన్‌గా వేడ్ బాధ్యతలు నిర్వహించాడు. అదే విధంగా దేశీవాళీ టోర్నీల్లో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించిన అనుభవం కూడా ఉంది.
మరోవైపు బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ సారథిగా వేడ్ కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉండగా.. క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రక్ట్ జాబితాలో వేడ్ లేక పోవడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన సెంట్రల్ కాంట్రక్ట్ లిస్ట్ లో వేడ్ పేరు లేదు. ప్రస్తుతం వేడ్ కేవలం ఇంక్రిమెంటల్ కాంట్రాక్టును మాత్రమే కలిగి ఉన్నాడు.
చదవండి: IND Vs SA: పద్మనాభస్వామి ఆలయంలో సందడి చేసిన దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్
Comments
Please login to add a commentAdd a comment