
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేయడంతో 131 పరుగుల ఆధిక్యం దక్కింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా ఆరు వికెట్ల నష్టానికి 133 పరుగులతో ఉంది. దాంతో ఆసీస్‌కు రెండు పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. రేపటి ఆటలో ఆసీస్‌ను తొందరగా పెవిలియన్‌కు పంపితే టీమిండియా విజయానికి ఢోకా ఉండదు. కాగా, ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ ఆటలో ఓపెనర్‌గా వచ్చిన వేడ్(40;137 బంతుల్లో 3 ఫోర్లు) మాత్రమే ఆకట్టుకున్నాడు. (ధోనికి ‘స్పిరిట్ ఆఫ్ ద డెకేడ్’.. కారణం ఇదే!)
కాగా, వేడ్ సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసే క్రమంలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఎక్కువ భాగం నవ్వుతూ కనిపించాడు. అయితే అలా ఎందుకు చేశాడనేది ఎవరికీ అర్థం కాకపోయినా అది మాత్రం వేడ్‌కు కోపం తెప్పించింది. దాంతో పంత్‌పై స్లెడ్జింగ్‌కు దిగాడు వేడ్. ‘ ఎందుకలా నవ్వుతున్నావ్.. అంత అవసరం లేదు. ఒకసారి బిగ్‌స్క్రీన్‌పై తిరిగి చూసుకో. స్క్రీన్‌పై అది చాలా ఫన్నీగా కనిపిస్తోంది’ అంటూ వేడ్ తన నోటికి పని చెప్పాడు. ఇది వికెట్ల వద్దనున్న మైక్ ద్వారా బయట పడింది. పంత్‌ను స్లెడ్జ్ చేయడంపై వేడ్ టీ బ్రేక్‌లో మాట్లాడుతూ..‘ నవ్వుతూనే ఉన్నాడు. ఎందుకలా చేశాడో నాకైతే అర్థం కాలేదు. నన్ను చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. నా బ్యాటింగ్ తీరును చూసి అలా చేసి ఉండొచ్చు’ అని వేడ్ వివరణ ఇచ్చాడు.
The Wade-Pant verbals continue 🗣🍿 #AUSvIND pic.twitter.com/VjZ9hDm24I— cricket.com.au (@cricketcomau) December 28, 2020
Comments
Please login to add a commentAdd a comment