భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (నవంబర్ 23) తొలి మ్యాచ్ జరుగనుంది. వైజాగ్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌పై గెలిచి వరల్డ్‌కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా సారధిగా వ్యవహరించనున్నాడు.
ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ జట్టును ఎంపిక చేశారు. ఆసీస్ సైతం వారి కెప్టెన్ పాట్ కమిన్స్, వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌లకు విశ్రాంతి కల్పించింది. వరల్డ్‌కప్ ఫైనల్ హీరో ట్రవిస్ హెడ్ జట్టులో ఉన్నప్పటికీ తొలి టీ20కి ఆడే అవకాశం లేదు. అతనితో పాటు మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
ఆసీస్ తమ రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను తొలి మ్యాచ్‌లో అడించే అవకాశం ఉంది. సీనియర్లకు విశ్రాంతి కల్పించినప్పటికీ టీమిండియా ఆసీస్‌తో పోలిస్తే పటిష్టంగా కనిపిస్తుంది. కెప్టెన్ స్కై, ఇషాన్ కిషన్, యశస్వి, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. అక్షర్, బిష్ణోయ్‌లతో భారత స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. ఆర్షదీప్, ప్రసిద్ద్, ముకేశ్ కుమార్‌లతో కూడిన పేస్ విభాగమే కాస్త వీక్‌గా ఉంది.
మనదే పైచేయి..
ఇరు జట్ల మధ్య జరిగిన టీ20ల తీరును పరిశీలిస్తే.. ఆసీస్‌పై భారత్ స్పష్టమైన ఆధిక్యత కలిగి ఉందని తెలిస్తుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 26 టీ20ల్లో ఎదురెదురుపడగా.. భారత్ 15, ఆసీస్ 10 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఓ మ్యాచ్ రద్దైంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో 10 మ్యాచ్‌లు ఆడగా భారత్ 6 మ్యాచ్‌ల్లో గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
విశాఖలోనూ మనోళ్లే..!
విశాఖపట్నంలో టీమిండియా ఇప్పటి వరకు మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో (2016లో శ్రీలంకపై, 2022లో దక్షిణాఫ్రికాపై) గెలిచి, ఓ మ్యాచ్‌లో (2019లో ఆ్రస్టేలియా) ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment