మేజర్ లీగ్ క్రికెట్-2023 సీజన్‌లో భాగంగా లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్‌తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యునికార్న్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ మాథ్యూ వేడ్ (41 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం చేయగా.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ 2 సిక్సర్లు, బౌండరీతో 20 పరుగులు, స్టోయినిస్ 37 (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోరె ఆండర్సన్ 39 పరుగులు (20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశారు. కెప్టెన్ ఫించ్ 12 పరుగులతో (10 బంతుల్లో 2 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లు పడగొట్టగా.. అలీ ఖాన్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. ఆరంభంలో జేసన్ రాయ్ (21 బంతుల్లో 45; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), నితీశ్ కుమార్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్).. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (26 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సునీల్ నరైన్ (17 బంతుల్లో 28 నాటౌట్; 3 సిక్సర్లు) రాణించినప్పటికీ నైట్‌రైడర్స్ విజయతీరాలకు చేరలేకపోయింది. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌లో రిలీ రొస్సో (8) నిరాశపరిచాడు. యునికార్న్స్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రౌఫ్, బిష్ణోయ్, ఆండర్సన్ తలో వికెట్ చేజిక్కించుకున్నారు. ఈ ఓటమితో నైట్‌రైడర్స్ లీగ్‌లో హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ మేజర్ లీగ్ క్రికెట్ సీజన్ 2023లో ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment