T20 World Cup 2021 Pak Vs Aus: Australia Beat Pakistan Babar Azam Comments: ‘‘ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగానే వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టడానికి ప్రయత్నించాం. అయితే, ఆస్ట్రేలియా వంటి జట్టుకు ఆఖర్లో అవకాశం ఇస్తే ఎంతటి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందో తెలుసు. ఆ క్యాచ్(మాథ్యూ వేడ్)ను వదిలేయడమే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఒకవేళ ఆ క్యాచ్‌ను గనుక అందుకుని ఉంటే ఫలితం వేరేలా ఉండేది.
ఒక్కటి మాత్రం నిజం.. టోర్నీ మొత్తంలో మా జట్టు ఆడిన విధానం పట్ల కెప్టెన్‌గా నేను సంతృప్తిపడుతున్నాను. కీలక మ్యాచ్‌లో ఓడిపోవడం బాధాకరమే అయినా.. దీని నుంచి నేర్చుకున్న గుణపాఠం.. తదుపరి ఈవెంట్‌లో ఇలాంటి తప్పులు పునరావృతం చేయకుండా ఉండేందుకు దోహదం చేస్తుంది. టోర్నీ ఆసాంతం ఎంత బాగా ఆడినా.. ఒక్క చిన్నతప్పు కారణంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది కదా. ఏదేమైనా మా ఆటగాళ్లు ఎవరి పాత్రను వారు చక్కగా నెరవేర్చారు.
ప్రేక్షకుల నుంచి మాకు గట్టి మద్దతు లభించడం సంతోషకరం. దుబాయ్‌లో ఆడటాన్ని ఎల్లప్పుడూ మేము పూర్తిగా ఆస్వాదిస్తాం’’ అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఉద్వేగభరితంగా మాట్లాడాడు. కాగా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో సూపర్ 12 దశలో ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచిన పాకిస్తాన్.. రెండో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఫైనల్ చేరాలన్న బాబర్ ఆజమ్ బృందం ఆశలు గల్లంతయ్యాయి.
ముఖ్యంగా మార్కస్ స్టొయినిస్(40 పరుగులు), మాథ్యూ వేడ్(41 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ పాకిస్తాన్‌ను దెబ్బకొట్టింది. ప్రధానంగా షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో వేడ్.. ఇచ్చిన క్యాచ్‌ను హసన్ అలీ మిస్ చేయడం.. ఆ తర్వాత అతడు వరుసగా మూడు సిక్సర్లు బాది ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే ఆసీస్ గెలుపును ఖాయం చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఆరోన్ ఫించ్ బృందం ఫైనల్‌కు చేరింది. ఇప్పటి వరకు అందని ద్రాక్షగా ఉన్న టీ20 వరల్డ్‌కప్ టైటిల్ కోసం నవంబరు 14న న్యూజిలాండ్‌తో తలపడనుంది.
స్కోర్లు:
పాకిస్తాన్- 176/4 (20)
ఆస్ట్రేలియా- 177/5 (19)
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: T20 World Cup 2021 Pak Vs Aus: అప్పుడు మైక్ హస్సీ.. ఇప్పుడు వేడ్.. పాక్‌ను దెబ్బకొట్టారు!
Comments
Please login to add a commentAdd a comment