T20 World Cup 2021 Pak Vs Aus Highlights: Netizens Compare Matthew Wade Innings With Mike Hussey - Sakshi
Sakshi News home page

T20 World Cup 2021 Pak Vs Aus: అప్పుడు మైక్‌ హస్సీ.. ఇప్పుడు వేడ్‌.. పాక్‌ను దెబ్బకొట్టారు!

Published Fri, Nov 12 2021 8:08 AM | Last Updated on Fri, Nov 12 2021 10:34 AM

T20 World Cup 2021 Pak Vs Aus: Matthew Wade Innings Resembles Mike Hussey in 2010 - Sakshi

T20 World Cup 2021 Pak Vs Aus: Matthew Wade Innings Resembles Mike Hussey in 2010: టీ20 వరల్డ్‌కప్‌-2021 రెండో సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా మెరుపు దాడి చూసినవారికి 2010 టి20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్యే జరిగిన రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ గుర్తుకు రాకమానదు. పాక్‌ 191 పరుగులు చేయగా... ఆస్ట్రేలియా 7 వికెట్లకు 197 పరుగులు సాధించింది. నవంబరు 11న మాథ్యూ వేడ్‌ తరహాలో మైక్‌ హస్సీ చివర్లో చెలరేగి జట్టును గెలిపించాడు. ఇప్పుడు పాక్‌ ప్రధానాస్త్రం షాహిన్‌ అఫ్రిది ఓవర్లో వేడ్‌ 3 సిక్సర్లు బాదగా... నాడు పాక్‌ టాప్‌ స్పిన్నర్‌ అజ్మల్‌ వేసిన చివరి ఓవర్లో హస్సీ వరుసగా 6, 6, 4, 6 విధ్వంసం సృష్టించాడు.

ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ విజయం కోసం చివరి 5 ఓవర్లలో 70 పరుగులు కావాల్సి ఉండగా...ఈ సారి ఆసీస్‌కు ఆఖరి 5 ఓవర్లలో 62 పరుగులు అవసరమయ్యాయి. రెండు సార్లు కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించిన చాంపియన్‌ తరహా ఆటను ప్రదర్శించిన కంగారూలదే పైచేయి అయింది. పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించి ఫైనల్‌కు చేరుకుంది. నవంబరు 14న న్యూజిలాండ్‌తో జరిగే తుదిపోరులో ఆస్ట్రేలియా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

చదవండి: Eng Vs Nz: ఆ రెండు జట్లే మమ్మల్ని ఓడించగలవు.. హా.. మరి మేము బూర్జ్‌ ఖలీఫా చూడటానికి వచ్చాం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement