Bangladesh vs Pakistan Test 2021:Fans Distract Shaheen Afridi With Matthew Wade Chants - Sakshi
Sakshi News home page

BAN VS PAk: మాథ్యూ వేడ్‌ పేరుతో పాక్‌ బౌలర్‌ను ఎగతాళి చేసిన ఫ్యాన్స్

Published Mon, Nov 29 2021 2:00 PM | Last Updated on Mon, Nov 29 2021 3:31 PM

Fans Distract Shaheen Afridi With Matthew Wade Chants  - Sakshi

Fans Distract Shaheen Afridi With Matthew Wade Chants: బంగ్లాదేశ్‌- పాకిస్తాన్‌ తొలి టెస్ట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్ షా అఫ్రిది బౌండరీలైన్‌ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తుండగా.. స్టాండ్స్‌లోని ప్రేక్షకులు మాథ్యూ వేడ్‌ అంటూ పదే పదే హేళన చేశారు. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌-2021 సెమీఫైనల్లో భాగంగా షాహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో వేడ్‌.. వరుసగా మూడు సిక్సర్‌లు బాది ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫైనల్‌కు చేరిన ఆరోన్‌ ఫించ్‌ బృందం ఏకంగా విజేతగా నిలిచింది.

ఇక బంగ్లా- పాక్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి టెస్ట్‌లో అఫ్రిది అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్‌లో మూడు కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో అఫ్రిది ఏకాగ్రతను దెబ్బ తీయడానికి బంగ్లా అభిమానులు ప్రయత్నం చేశారు. అందుకే మాథ్యూ వేడ్‌ పేరును పదే పదే జపం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: IPL 2022 Auction: రాహుల్‌, రషీద్‌ ఖాన్‌ను లాక్కొన్నారు.. పంజాబ్‌, హైదరాబాద్‌ లబోదిబో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement