సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను ఇంకా మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. ఆసీస్ నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌ను టీమిండియా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ధావన్(52), రాహుల్(30)ల ఆరంభానికి మిడిల్ ఆర్డర్‌లో కోహ్లి(40) మెరుపులు కూడా తోడయ్యాయి. చివర్లో హార్దిక్ పాండ్యా(42 నాటౌట్) బ్యాట్ ఝుళిపించడంతో టీమిండియా ఎటువంటి ఒత్తిడి లేకుండానే విజయం సొంతం చేసుకుంది. కాగా, ధావన్‌ను స్టంపింగ్ చేయడానికి యత్నించిన మథ్యూ వేడ్ విఫలమయ్యాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో భాగంగా స్వెప్సన్ వేసిన 9 ఓవర్ ఐదో బంతిని ధావన్ ఆఫ్‌సైడ్ చేయడానికి యత్నించాడు. అది కాస్తా మిస్ కావడంతో వేడ్ వెంటనే స్టంపింగ్ చేశాడు. దానికి గట్టిగా అప్పీల్ చేశాడు వేడ్. (చదవండి: సెకండ్ చాన్స్ ఇవ్వని కోహ్లి..!)
దీనిపై థర్డ్ అంపైర్ సమీక్ష తర్వాత ధావన్‌ను నాటౌట్‌గా ప్రకటించారు ఫీల్డ్ అంపైర్లు. ఆ తర్వాత వేడ్ నోటి నుంచి వచ్చిన మాటలు అక్కడ ఉన్న ధావన్‌కు నవ్వు తెప్పించింది. ఇంతకీ ధావన్‌ను చూస్తూ వేడ్ అన్నది ఏమిటంటే.. ‘నేను ధోనిని కాదు.. ధోని తరహాలో వేగంగా స్టంపింగ్ చేయడానికి’ అని జోక్స్ పేల్చాడు. ఇది బాగా వైరల్ అయ్యింది. ప్రపంచ క్రికెట్‌లో ధోని ఒక అత్యుత్తమ వికెట్ కీపర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రత్యేకంగా స్టంపింగ్‌లో ధోని చాలా క్విక్‌గా రియాక్ట్ అవుతాడు. దీన్నిఉద్దేశించే వేడ్ మాట్లాడాడు. ఒకవేళ తానే ధోనిని అయ్యుంటే అది కచ్చితంగా స్టంపౌట్ అయ్యేదని ధావన్‌కు పరోక్షంగా తెలియజేశాడు వేడ్. నిన్నటి మ్యాచ్‌కు ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ గాయం కారణంగా దూరం కావడంతో వేడ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. (చదవండి; ‘వారు లేకుండా గెలిచాం.. ఇంతకంటే ఏం కావాలి’)
Comments
Please login to add a commentAdd a comment