వారి వేగాన్ని అందుకోవాలని యత్నిస్తున్నా: ధావన్‌ | Iam Trying To Match Thier Speed, Dhawan | Sakshi
Sakshi News home page

వారి వేగాన్ని అందుకోవాలని యత్నిస్తున్నా: ధావన్‌

Published Sat, May 25 2019 1:09 PM | Last Updated on Thu, May 30 2019 2:02 PM

Iam Trying To Match Thier Speed, Dhawan - Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ప్రస్తుతం విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత క్రికెట్‌ జట్టు.. ఇంగ్లండ్‌లో సందడి చేస్తోంది. ఈరోజు(శనివారం) న్యూజిలాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు తన సహచర ఆటగాళ్లు అయిన ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యాలతో కలిసి శిఖర్‌ ధావన్‌ సందడి చేశాడు. దీనిలో భాగంగా వీరిద్దరి వేగాన్ని అందుకోవడానికి యత్నిస్తున్నానని ధావన్‌ ఓ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు.

భారత వరల్డ్‌కప్‌ జట్టులో ఓపెనింగ్‌ జోడి ధావన్‌, రోహిత్‌లతో పాటు కోహ్లి, ధోని, పాండ్యాలు కీలకం కానున్నారు. మే30వ తేదీ నుంచి ఆరంభమయ్యే వరల్డ్‌కప్‌లో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మెగాటోర్నీలో భాగంగా కోహ్లి నాయకత్వంలోని టీమిండియా జూన్‌ 5న సౌతాంప్టన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement