IPL 2023: All 10 Teams Captains And Their Salary, Networth, Family & Personal Details - Sakshi
Sakshi News home page

IPL 2023 Captains Salaries: సూపర్‌ క్రేజ్‌.. సంపాదన కోట్లలో.. ఐపీఎల్‌ కెప్టెన్ల ‘బలగం’.. బలం! వీరి గురించి తెలుసా? పాపం అతడొక్కడే!

Published Fri, Mar 31 2023 12:16 PM | Last Updated on Fri, Mar 31 2023 1:50 PM

IPL 2023: 10 Teams Captains Salary Networth Family Personal Details - Sakshi

IPL 2023 10 Teams Captains- Families: వేసవిలో వినోదం పంచేందుకు ఐపీఎల్‌ పండుగ వచ్చేసింది. పది జట్ల మధ్య పోటాపోటీ క్రికెట్‌ ప్రేమికులకు కావాల్సినంత మజాను అందించనుంది. పొట్టి ఫార్మాట్‌ మెగా సమరానికి శుక్రవారం(మార్చి 31) తెరలేవనుంది. గతేడాది చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌, నాలుగుసార్లు ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరంభ మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి.

మరి ఐపీఎల్‌-2023లో ఆయా జట్లకు సారథ్యం వహించనున్న కెప్టెన్లు, వారి జీతం, నికర సంపాదన.. తదితర వివరాలు.. అదే విధంగా ఫ్రాంఛైజీల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా.. వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ.. నిరాశకు లోనైన వేళ అండగా నిలిచే ‘బలగం’.. అదేనండీ వారి కుటుంబాలు, వ్యక్తిగత వివరాల గురించి తెలుసుకుందాం!

గుజరాత్‌ టైటాన్స్‌
కెప్టెన్‌: హార్దిక్‌ పాండ్యా
►టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌
►గత సీజన్‌లో క్యాష్‌ రిచ్‌లో తొలిసారి అడుగుపెట్టిన గుజరాత్‌కు టైటిల్‌ అందించిన సారథి.
►గుజరాత్‌ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ అందుకుంటున్న మొత్తం: 15 కోట్లు

►2015లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన హార్దిక్‌ సుదీర్ఘకాలం పాటు ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. ముంబై జట్టులో కీలస సభ్యుడిగా ఎదిగిన పాండ్యా నికర సంపాదన సుమారు 67 కోట్లు!

ముచ్చటైన కుటుంబం
గుజరాత్‌కు చెందిన హార్దిక్‌ పాండ్యా మధ్యతరగతి కుటుంబం నుంచి ఈ స్థాయికి చేరుకున్నాడు. పాండ్యా సక్సెస్‌ జర్నీలో అతడి తల్లిదండ్రులు, సోదరుడు, టీమిండియా క్రికెటర్‌ కృనాల్‌ పాండ్యతో పాటు భార్య నటాషా స్టాంకోవిక్‌ పాత్ర కూడా ఉంది. విరామం దొరికితే చాలు తన సమయం మొత్తాన్ని కుటుంబానికే కేటాయిస్తాడు హార్దిక్‌. భార్య నటాషా, కొడుకు అగస్త్యతో గడుపుతాడు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌
కెప్టెన్‌: మహేంద్ర సింగ్‌ ధోని
►టీమిండియా మాజీ సారథి, భారత్‌కు మూడు ఐసీసీ టైటిల్స్‌ అందించిన ఏకైక కెప్టెన్‌గా మిస్టర్‌ కూల్‌ ఘనత.
►చెన్నై జట్టును నాలుగుసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిపాడు ధోని ఐపీఎల్‌ సాలరీ: 12 కోట్ల రూపాయలు.
►క్రికెటర్‌గా, వ్యాపారవేత్తగా, ఎండార్స్‌మెంట్ల రూపంలోనూ చేతినిండా సంపాదించే ధోని నెట్‌వర్త్‌ 2022 నాటికి: దాదాపు 1030 కోట్లు 

అందమైన ఫ్యామిలీ
రాంచిలోని సగటు మధ్య తరగతి కుటుంబానికి చెందిన ధోని.. అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. భార్య సాక్షి, కుమార్తె జీవాతో ఎక్కువ సమయం గడుపుతాడు ధోని. సాక్షితో పాటు జీవా కూడా తన తండ్రిని చీర్‌ చేస్తూ ఐపీఎల్‌లో సందడి చేస్తూ ఉంటుంది.

లక్నో సూపర్‌ జెయింట్స్‌
కెప్టెన్‌: కేఎల్‌ రాహుల్‌

►టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌
►గతంలో పంజాబ్‌ కింగ్స్‌ సారథిగా వ్యవహరించిన కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం 17 కోట్ల జీతం అందుకుంటున్నాడు. ఆర్సీబీతో 2014లో ఐపీఎల్‌ ప్రయాణం మొదలుపెట్టిన రాహుల్‌ నికర సంపాదన సుమారుగా 75 కోట్లు అని అంచనా.

►కర్ణాటక బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఈ ఏడాది ఆరంభంలో పెళ్లి చేసుకున్నాడు. బాలీవుడ్‌ నటి అతియా శెట్టితో కలిసి ఏడడుగులు వేశాడు. రాహుల్‌ తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులు.

ముంబై ఇండియన్స్‌
కెప్టెన్‌: రోహిత్‌ శర్మ
►టీమిండియా ప్రస్తుత కెప్టెన్‌
►ముంబై జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించిన సారథి
►ఐపీఎల్‌లో అత్యధికసార్లు టైటిల్‌ గెలిచిన కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఘనత
►15 సీజన్లపాటు ఐపీఎల్‌ ఆడిన హిట్‌మ్యాన్‌ ప్రస్తుత సాలరీ 16 కోట్లు.
►టీమిండియా సారథి అయిన రోహిత్‌ నికర సంపాదన దాదాపుగా 214 కోట్ల రూపాయలు.

►రోహిత్‌ శర్మకు భార్య రితికా సజ్దే, కుమార్తె సమైరా శర్మ అంటే ప్రాణం. ఈ మహారాష్ట్ర బ్యాటర్‌ను చీర్‌ చేస్తూ వీళ్లిద్దరు ఐపీఎల్‌లో చేసే సందడి అంతా ఇంతాకాదు.

పంజాబ్‌ కింగ్స్‌
కెప్టెన్‌: శిఖర్‌ ధావన్‌
తొలిసారి పంజాబ్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ ధావన్‌.
2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో క్యాష్‌ రిచ్‌లీగ్‌లో అడుగుపెట్టిన గబ్బర్‌.. ప్రస్తుత ఐపీఎల్‌ సాలరీ 8.25 కోట్లు. నెట్‌వర్త్‌ సుమారు 105 కోట్లు అని అంచనా.

విఫలమైన బంధం
శిఖర్‌ ధావన్‌ ఆస్ట్రేలియాకు చెందిన అయేషాను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తర్వాత ధావన్‌తో ఆమెకు కలిగిన సంతానం జొరావర్‌.

చాలా అన్యోన్యంగా మెలిగే ధావన్‌- అయేషా మనస్పర్థల కారణంగా గతేడాది విడిపోయారు. భార్యకు దూరమై ఒంటరిగా మిగిలిపోయిన గబ్బర్‌కు ఫ్యామిలీ మద్దతులగా నిలబడింది.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
కెప్టెన్‌: శ్రేయస్‌ అయ్యర్‌
అయ్యర్‌ గాయం కారణంగా దూరం కావడంతో నితీశ్‌ రాణాకు కేకేఆర్‌ పగ్గాలు. ఐపీఎల్‌-2023లో కోల్‌కతాను ముందుండి నడిపించనున్న నితీశ్‌(సాలరీ 3.4 కోట్ల రూపాయలు).

శ్రేయస్‌ అయ్యర్‌ 2015లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అతడి ప్రస్తుత సాలరీ. 12.5 కోట్లు. టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ అయిన అయ్యర్‌ నెట్‌వర్త్‌ దాదాపు 53 కోట్లు. అయ్యర్‌ ఎదుగుదలలో అతడి తల్లిదండ్రులు, సోదరి పాత్ర కూడా ఉందని పలు సందర్భాల్లో చెప్పాడు.

రాజస్తాన్‌ రాయల్స్‌
కెప్టెన్‌: సంజూ శాంసన్‌
►టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర​ సంజూ శాంసన్‌
►కేరళకు చెందిన సంజూ రాజస్తాన్‌ రాయల్స్‌ సారథిగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. గతేడాది రాయల్స్‌ను ఫైనల్‌కు చేర్చి సత్తా చాటాడు.

►సంజూ తన స్నేహితురాలు చారులతను ప్రేమించి పెళ్లాడాడు. సంజూ ఐపీఎల్‌ సాలరీ 14 కోట్లు కాగా.. నికర సంపాదన దాదాపుగా 72 కోట్లు.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
కెప్టెన్‌: ఫాఫ్‌ డుప్లెసిస్‌


సౌతాఫ్రికా బ్యాటర్‌ డుప్లెసిస్‌ ఆర్సీబీని గతేడాది ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు.
2011లో చెన్నై తరఫున ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన ఫాఫ్‌.. ప్రస్తుత ఐపీఎల్‌ సాలరీ 7 కోట్లు. ఈ ప్రొటిస్‌ బ్యాటర్‌ నెట్‌వర్త్‌ సుమారు 130 కోట్ల రూపాయలు.

ఢిల్లీ క్యాపిటల్స్‌
కెప్టెన్‌: రిషభ్‌ పంత్‌ గైర్హాజరీలో డేవిడ్‌ వార్నర్‌


ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ వార్నర్‌
గతంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారథిగా ఉన్న వార్నర్‌ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా అందుకుంటున్న జీతం.. 6.25 కోట్లు.

ముగ్గురు కుమార్తెలు
డేవిడ్‌ వార్నర్‌ పక్కా ఫ్యామిలీమ్యాన్‌. అతడి భార్య పేరు కాండిస్‌. ఈ జంటకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో వెకేషన్‌కు చెక్కేస్తాడు వార్నర్‌.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
కెప్టెన్‌: ఎయిడెన్‌ మార్కరమ్‌


►సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌ను విజేతగా నిలిపిన మార్కరమ్‌.
►ఐపీఎల్‌-2023లో హైదరాబాద్‌ సారథిగా ఎంపికైన మార్కరమ్‌.
►అతడి ఐపీఎల్‌ సాలరీ 2.6 కోట్లు కాగా.. ఈ ప్రొటిస్‌ బ్యాటర్‌ నికర ఆస్తి 30 కోట్లు.
►మార్కరమ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ నికోలీ డానియెల్‌ ఒ కనార్‌. 

చదవండి: IPL 2023: ఈసారి టైటిల్‌ గెలిచే అవకాశాలు వాళ్లకే: ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ రిక్కీ పాంటింగ్‌
 IPL 2023: తెర వెనుక నాయకులను చూసేద్దామా.. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement