ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ సొంతం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో కివీస్ ఓపెనర్ విల్ యంగ్‌ను వేడ్ పెవిలియన్‌కు పంపాడు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో తొలి బంతిని యంగ్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే షాట్ మిస్‌టైమ్ కావడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ వేడ్ పరిగెత్తుకుంటూ వెళ్లి బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్‌లో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు.
ఇది చూసిన యంగ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఫిబ్రవరి 25న జరగనుంది.
— Sitaraman (@Sitaraman112971) February 23, 2024
Comments
Please login to add a commentAdd a comment