Women's Cricket World Cup 2022: Heather Knight Pulls Off an Incredible One Handed Catch Video Viral - Sakshi
Sakshi News home page

Heather Knight: గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకున్న ఇంగ్లండ్‌ కెప్టెన్‌ 

Published Sun, Mar 20 2022 4:07 PM | Last Updated on Sun, Mar 20 2022 5:10 PM

Womens World Cup: England Captain Heather Knight Jaw Dropping One Handed Catch Vs New Zealand - Sakshi

NZW VS ENGW: మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022లో భాగంగా ఆతిధ్య న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 20, ఆదివారం) జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌ వికెట్‌ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్‌ కాగా, ఛేదనలో ఇంగ్లండ్ 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. ఆల్‌రౌండర్‌ నతాలీ స్కివర్ (108 బంతుల్లో 61; 5 ఫోర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడి ఇంగ్లండ్‌ విజయంలో కీలకపాత్ర పోషించింది. అంతకుముందు మ్యాడీ గ్రీన్‌ (52) అజేయమైన అర్ధశతకంతో రాణించడంతో న్యూజిలాండ్‌ ఓ మోస్తరు స్కోరైనా చేయగలిగింది.   


ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ చేసిన ఓ అద్భుతమైన విన్యాసం మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ 39వ ఓవర్ రెండో బంతికి సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో న్యూజిలాండ్ పవర్‌ హిట్టర్‌ లీ తహుహు భారీ షాట్‌కు ప్రయత్నించగా.. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌ను అందుకుంది. రెప్పపాటు సమయంలో నైట్‌ చేసిన ఈ విన్యాసాన్ని చూసి మైదానంలో ఉన్న వాళ్లంతా నోర్లెళ్లబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. 
చదవండి: ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లండ్‌ విజయం.. న్యూజిలాండ్‌కు ఇక కష్టమే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement